STOCKS

News


ఇండియా వైపు మార్క్‌మొబియస్‌ మొగ్గు

Friday 25th January 2019
news_main1548397699.png-23800

ప్రపంచపేరొందిన ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ ఈ ఏడాది పెట్టుబడులకు భారత్‌ బాగుందని సూచిస్తున్నారు. వర్ధమాన మార్కెట్లలో భారత్‌, బ్రెజిల్‌, టర్కీలపై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ మార్కెట్లలో ఎంటరయ్యేందుకు ఇదే మంచి తరుణమన్నారు. ఇటీవలే ఇండియాలో పర్యటించానని, అక్కడ వచ్చిన మార్పులు చాలా ఆశ్చర్యాన్నిచ్చాయని తెలిపారు. చాలా వరకు వర్ధమాన మార్కెట్లలో భారీ రికవరీ కనిపిస్తోందని చెప్పారు. గతేడాది ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ రేట్ల భయాలతో ఈ మార్కెట్లు నేల చూపులు చూశాయి. కానీ భారత్‌ ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడిందని, 7 శాతం వృద్ధి సాధించే సత్తా ఉన్న అంత పెద్ద దేశం వేరొకటి లేదని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం వర్దమాన మార్కెట్లు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, అభివృద్ధి చెందిన దేశాల వాల్యూషన్ల కన్నా తక్కువగాఉన్నాయని చెప్పారు. ట్రేడ్‌వార్‌పై పెద్దగా ఆందోళన అనవసరమని, ఇతర దేశాలన్నీ కలిపి చైనా వాణిజ్యాన్ని భర్తీ చేయగలవని అభిప్రాయపడ్డారు.

తన వద్ద ఉన్న నిధులను కింద చూపిన విధంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతానని తెలిపారు...
- భారత్‌లో 30 శాతం నిధులు
- బ్రెజిల్‌, అర్జెంటినాతో కలిపి లాటిన్‌ అమెరికాలో 30 శాతం నిధులు.
- పోలాండ్‌, రొమేనియాలాంటి తూర్పు యూరప్‌దేశాల్లో 30 శాతం నిధులు
- 10 శాతం నిధులు చైనాతో సహా ఆసియా దేశాలు.

 



You may be interested

ఆదిత్యా బిర్లా సన్‌లైప్‌...మంత్లీ ఇన్‌కమ్‌ప్లాన్‌

Friday 25th January 2019

ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌ పేరిట వినూత్నమైన బీమా పథకాన్ని ఆవిష్కరించింది. కాల వ్యవధి తీరేంత వరకు ఈ ప్లాన్‌ నెలవారీ ఆదాయాన్నిస్తుందని సంస్థ తెలియజేసింది. పాలసీ ప్రీమియం చెల్లింపు ముగిసిన తర్వాత నుంచి పాలసీ కాల వ్యవధి ముగిసేంత వరకు ఏటా సమ్‌ అష్యూర్డ్‌లో ఒక శాతాన్ని నెలవారీ చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఇన్వెస్టర్లు తమకు ఇష్టమైతే నెలవారీ ఒక శాతం ఆదాయాన్ని

ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాల వివరాలు

Friday 25th January 2019

పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 32 శాతం అప్‌ న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో (అక్టోబర్‌-డిసెంబర్‌) 32 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.229 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్వార్టర్‌లో రూ.303 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.2,078 కోట్లకు పెరిగింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.1,416 కోట్లతో పోలిస్తే 46 శాతం వృద్ధి

Most from this category