News


అమెరికాలో మాంద్యం సంకేతాలు?!

Saturday 16th February 2019
news_main1550308215.png-24219

ఒకపక్క ట్రేడ్‌వార్‌ సమసిపోలేదు.. మరోపక్క అంతర్జాతీయంగా వృద్ది నెమ్మదిస్తోంది. ఇవన్నీ కలిసి క్రమంగా యూఎస్‌ ఎకానమీలో మరోమారు మాంద్యాన్ని సృష్టించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం తప్పదన్న సంబంధించి సంకేతాలు కనిపిస్తున్నాయని ఎక్కువమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది వృద్ది పాజిటివ్‌గానే ఉంటుందని ఒకపక్క అనలిస్టులంతా అభిప్రాయపడుతున్నారు. కానీ మరోపక్క మాంద్యం ముంచుకొచ్చే అవకాశాలు ఆరేళ్ల గరిష్ఠాలకు చేరాయని గుర్తు చేస్తున్నారు. యూఎస్‌ ఎకానమీ ఇటీవల కాలంలో గత పదేళ్లలో లేనంతగా విస్తరిస్తోంది. కానీ ఇదే సమయంలో సమాంతరంగా ఆర్థిక మందగమన భయాలు కూడా పెరుగుతున్నాయి. 
2020 చివరి నాటికి యూఎస్‌ మరోమారు ఆర్థికమాంద్యం కోరల్లోకి జారుతుందని పలు దిగ్గజ కంపెనీల కార్పొరేట్‌ సీఎఫ్‌ఓలు అభిప్రాయపడ్డారు. వీరితో పాటు నోబుల్‌ బహుమతి అందుకున్న ప్రముఖ ఎకనమిస్టులు పౌల్‌ క్రుగ్‌మెన్‌, రోబర్ట్‌ షిల్లర్‌ సైతం మాంద్య అవకాశాలున్నాయని చెబుతున్నారు. మాంద్యాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పారామీటర్లు ఏమీ లేనప్పటికీ కొన్ని సంకేతాలు గమనించి గుర్తించవచ్చని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఫెడ్‌ అనుసరించే రెసిషన్‌ ప్రాబబిలిటీ ట్రాకర్‌ కీలకం. వివిధ కాలపరిమితి కల బాండ్‌ ఈల్డ్స్‌ మధ్య వ్యత్యాసాల ఆధారంగా ఈ ట్రాకర్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ట్రాకర్‌ ప్రకారం వచ్చే 12 నెలల్లో మాంద్యం రావడానికి 23.6 శాతం అవకాశాలున్నాయి. 2008 తర్వాత ట్రాకర్‌ సూచిలో మాంద్య అవకాశాలు ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఈ సిగ్నల్‌ను గమనించే కొందరు ఎకనమిస్టులు మాంద్యం తప్పదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. 



You may be interested

నిధుల వెల్లువ రానుంది!

Saturday 16th February 2019

దేశీ మార్కెట్‌పై జీటీఐ క్యాపిటల్‌ భారత్‌ మార్కెట్లో పెట్టుబడులకు విదేశీ మదుపరులు చాలా పెద్దమొత్తంలో నిధులు పెట్టుకొని కూర్చొని ఉన్నట్లు జీటీఐ క్యాపిటల్‌ ప్రతినిధి మాధవ్‌ ధార్‌ చెప్పారు. గతేడాది ఎఫ్‌పీఐలు ఇండియా మార్కెట్ ప్రదర్శనతో నిరుత్సాహపడ్డారన్నారు. అయితే క్రమంగా దేశీయ ఎకానమీ బిజినెస్‌ ఫ్రెండ్లీగా, ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీగా మారిపోతోందని గుర్తిస్తున్నారన్నారు. ఇప్పటికింకా సంస్కరణల ఫలాలు పూర్తిగా కనిపించడంలేదని, అందుకే 7 శాతానికి అటుఇటుగా వృద్ధి నమోదవుతోందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో

లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 16th February 2019

చైనాతో వాణిజ్య చర్చలు సఫలవమచ్చనే ఆశావహనంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వాషింగ్టన్‌లో వచ్చే వారంలో కూడా చైనాతో వాణిజ్య చర్చలు కొనసాగుతాయి. చైనా దిగుమతులపై అదనపు సుంకాల విధింపునకు తుది గడువు మార్చి 1వ తేది నాటికి ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభింవచ్చని ఆశిస్తునట్లు శుక్రవారం వైట్‌హౌస్‌ ఓ అధికార ప్రకటనతో తెలిపింది. గోల్డ్‌మెన్‌ శాచ్స్‌, జేపీ మోర్గాన్‌ లాంటి ఆర్థిక షేర్ల ర్యాలీతో డోజోన్స్‌

Most from this category