STOCKS

News


ఆమ్రపాలి గ్రూప్ స్థిరాస్తులకు తాళాలు

Thursday 11th October 2018
news_main1539231755.png-21035

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌నకు చెందిన 9 ప్రాపర్టీలకు సీల్ వేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. గ్రూప్‌లోని 46 సంస్థల కీలక పత్రాలు ఆయా ప్రాపర్టీల్లో ఉన్నాయంటూ కంపెనీ డైరెక్టర్లు తెలిపిన మీదట అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిరాస్తులు నోయిడా, గ్రేటర్ నోయిడా, బీహార్‌లోని రాజ్‌గిర్‌, బక్సర్‌లో ఉన్నాయి. తొమ్మిది ప్రాపర్టీలకు సీల్ వేసిన తర్వాత తాళం చెవులను సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు అప్పజెప్పాల్సిందిగా ఆయా ప్రాంతాల ఎస్‌పీలకు న్యాయస్థానం సూచించింది. కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు రవి భాటియా, పవన్ కుమార్ అగర్వాల్‌ తదితరులకు మాత్రమే ఈ ప్రాపర్టీల్లోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే కీలక డాక్యుమెంట్స్ అన్నీ ఈ ప్రాపర్టీల్లోనే ఉన్నాయంటూ పోలీస్ కస్టడీలో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు లిఖితపూర్వకంగా పత్రం ఇవ్వాలని సూచించింది. ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టుల్లో 42,000 పైచిలుకు ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసిన వారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు జారీ చేసిన పలు ఆదేశాలను ఉల్లంఘించారంటూ మంగళవారం ఆమ్రపాలి గ్రూప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ముగ్గురు డైరెక్టర్లను పోలీస్ కస్టడీకి పంపింది.



You may be interested

బీమా ఇంటర్మీడియరీ రంగంలోనూ పూర్తి ఎఫ్‌డీఐలు!

Thursday 11th October 2018

న్యూఢిల్లీ:  ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌తోపాటు బీమా ఇంటర్మీడియరీ రంగంలోనూ పూర్తి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ)  ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఆర్థికశాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్సూరెన్స్‌ బ్రోకరేజ్‌ సంస్థల్లో ప్రస్తుతం ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతంగా ఉంది. దీనిని 100 శాతం పెంచడంపై ఆర్థికశాఖ ఐఆర్‌డీఏఐ సలహా

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 11th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- తన అనుబంధ సంస్థ అదానీ అగ్రో లాజిస్టిక్స్‌ సంస్థను విలీనం చేసుకుంది. పీటీసీ ఇండియా:- బంగ్లాదేశ్‌కు 15ఏళ్ల పాటు 200 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆదేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీఎల్‌ ఎడ్యుకేట్‌:- అమెజాన్‌ అలెక్సా పవర్‌తో వ్యాపార ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది. జీఈ పవర్‌:- వడోదరా, షాహాబాద్‌ యూనిట్లను విస్తరించేందుకు కమిటిని ఏర్పాటు చేసింది. ఆయిల్‌ ఇండియా:- డిబ్రూగర్ & టిన్సుకియా జిల్లాలలో రెండు

Most from this category