STOCKS

News


యూఎస్‌ బాండ్‌ ఇన్వర్షన్‌తో ఇండియా ఈక్విటీలకు మేలు

Thursday 28th March 2019
news_main1553756132.png-24839

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ ఇన్వర్షన్‌(ఒకే క్రెడిట్‌ క్వాలిటీ ఉన్న దీర్ఘకాలిక డెట్‌ సాధనాలు, స్వల్పకాలిక డెట్‌ సాధనాల కన్నా తక్కువ ఈల్డ్‌ ఇవ్వడం) సంకేతాలు ఇవ్వడం త్వరలో ఆర్థికమాంద్యం వస్తుందనేందుకు సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పన్నెండేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లు ఫుల్‌ బూమ్‌లో ఉన్నప్పుడు యూఎస్‌ బాండ్‌ఈల్డ్స్‌లో ఇన్వర్షన్‌ ఏర్పడింది. అనంతర ఏడాదిలో సబ్‌ప్రైమ్‌ సంక్షోభంతో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారింది. పుష్కర కాలం తర్వాత గతవారం యూఎస్‌బాండ్‌ మార్కెట్లో ఈల్డ్స్'‌ ఇన్వర్షన్‌ కనిపించింది. దీంతో మారో మారు మాంద్య భయాలు పెరిగాయి. కానీ అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌' ఇన్వర్షన్‌తో ఏర్పడే మాంద్యం భారత్‌ను తాకకపోవచ్చని, పైగా ఈ ఇన్వర్షన్‌ ఇండియా ఈక్విటీలకు మేలు చేస్తుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేస్తోంది. భారత్‌ ఇతర దేశాలతో పోలిస్తే స్థిర ప్రదర్శన చేస్తుండడంతో విదేశీ మదుపరులు ఇలాంటి సమయంలో ఇండియా వైపు చూస్తారని తెలిపింది. ఇప్పటికే జనవరిలో ఆసియా మొత్తం మీద అధిక ఎఫ్‌ఐఐలు ఇండియాకి వచ్చినట్లు గుర్తు చేసింది. గతంలో కూడా యూఎస్‌లో మందగమనం భారత మార్కెట్లపై నేరుగా ప్రభావం చూపలేదని వివరించింది. ఇలాంటి ఇన్వర్షన్లు వచ్చిన సందర్భాల్లో భారత మార్కెట్లు ఇతర మార్కెట్ల కన్నా మంచి ప్రదర్శన చూపాయని తెలిపింది.

2007లో బాండ్‌ ఇన్వర్షన్‌ ఏర్పడిన అనంతర ఆరు నెలల కాలంలో  ఎంఎస్‌సీఐ ఆసియా పసిఫిక్‌ సూచీ 12 శాతం, సంవత్సర కాలంలో 3.7 శాతం రాబడులు ఇచ్చింది. ఇదే సమయంలో ఇండియా మార్కెట్‌ మంచి ప్రదర్శన చూపింది. ప్రస్తుతం కూడా భారత బుల్‌ మార్కెట్‌ కొనసాగేందుకు అవసరమైన అంశాలన్నీ సమకూడి ఉన్నాయని, అందువల్ల దేశీయ మార్కెట్లు పాజిటివ్‌ పరుగు కొనసాగిస్తాయని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. You may be interested

డాలర్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లోకి పసిడి

Thursday 28th March 2019

డాలర్‌ ర్యాలీ కారణంగా గురువారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు నష్టపోయింది.యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం అమెరికా యూఎస్‌ క్రూడ్‌ ఇన్వెంటరీ నిల్వలు అంచనాలకు మించి నమోదు కావడంతో ముడిచమురు ధరలు సైతం తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు డాలర్‌ ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా గత రెండు రోజులుగా ర్యాలీ కొనసాగిస్తూ నేడు కూడా ఆరు

విమానాశ్రయాల వ్యాపారంలోకి టాటా గ్రూప్‌

Thursday 28th March 2019

అవకాశముంటే.. మళ్లీ వస్తా.. - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి - ఆర్థిక మంత్రిగా రావొచ్చన్న ఊహాగానాలపై స్పష్టీకరణ న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గానీ గెలిస్తే తాను ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయన్న వార్తలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్‌ తిరిగి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 'ది థర్డ్‌ పిల్లర్‌' పేరిట రాసిన

Most from this category