STOCKS

News


ఉద్యోగార్థుల్లో కొరవడుతున్న నైపుణ్యాలు

Thursday 14th March 2019
news_main1552543959.png-24598

  • ఐబీఎం చీఫ్ రోమెటీ

ముంబై: టెక్నాలజీ రంగంలో కొంగొత్త ఉద్యోగావకాశాలు కుప్పతెప్పలుగా వస్తున్నా.. వాటికి అవసరమైన నైపుణ్యాలు ఉద్యోగార్థుల్లో ఉండటం లేదని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం సీఈవో గినీ రోమెటీ చెప్పారు. విద్యపరంగా కేవలం డిగ్రీ పట్టా సంపాదించడం మాత్రమే కాకుండా నైపుణ్యాలను పెంచుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి సారించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని కంపెనీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గినీ తెలిపారు. లక్షల కొద్దీ ఇంజినీర్లు, బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్స్‌లో నాలుగింట మూడొంతుల మందికి ఉద్యోగనైపుణ్యాలు లేవంటూ నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 180 బిలియన్ డాలర్ల దేశీ సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం దేశీయంగా 135 కోట్ల జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ల వయస్సులోపు వారు ఉండగా.. 3.12 కోట్ల యువ జనాభా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు.You may be interested

మార్కెట్‌ మాట.. మళ్లీ మోదీ!!

Thursday 14th March 2019

సత్తా మార్కెట్‌లో జోరుగా బెట్టింగ్‌లు బీజేపీకి సొంతంగా 251 ఎన్‌డీఏ పక్షాలకు కలిపి 300 బెట్టింగ్‌ రాయుళ్ల పందాలు న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించనుందన్న అంచనాలతో సత్తా మార్కెట్లో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నడిచే ఈ బెట్టింగ్‌ మార్కెట్‌ను సత్తాబజార్‌గా పిలుస్తారు. పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై గత నెలలో భారత వాయుసేన మెరుపు దాడులతో బీజేపీ విజయావకాశాలు మెరుగుపడినట్టు సత్తా మార్కెట్‌

సమాజం కోసం ప్రేమతో రూ.52,700 కోట్లు

Thursday 14th March 2019

విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ తాజా కేటాయింపులు విప్రోలోని తన వాటాల్లో 34 శాతం న్యూఢిల్లీ: విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మరో సారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్‌

Most from this category