STOCKS

News


ఎస్‌బీఐ మొండిబకాయిల వేలం షురూ!

Wednesday 13th March 2019
Markets_main1552461696.png-24582

22, 26 తేదీల్లో 
రూ.3,640 కోట్లకుపైగా ఎన్‌పీఏల వేలం

ముంబై: మొండిబకాయిల (ఎన్‌పీఏ) వేలాన్ని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వేగవంతం చేసింది. దీని ప్రకారం మార్చి 26న రూ.2,338 కోట్ల విలువైన మొండిబకాయిల వేలాన్ని నిర్వహించనుంది. బ్యాంకులు, ఏఆర్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇతర ఆర్థిక సంస్థలకు పూర్తి 100 శాతం నగదు ప్రాతిపదికన ఎన్‌పీఏ అకౌంట్లను విక్రయించనున్నట్లు మంగళవారం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. విక్రయించనున్న అకౌంట్లలో ఇండియన్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ (రూ.929 కోట్లు),  జై బాలాజీ ఇండస్ట్రీస్‌ (రూ.859 కోట్లు), కోహినూర్‌ ప్లానెట్‌ కన్‌స్ర్టక‌్షన్‌ (రూ.208 కోట్లు), మిట్టల్‌ కార్పొరేషన్‌ (రూ.116 కోట్లు), ఎంసీఎల్‌ గ్లోబల్‌ స్టీల్‌ (రూ.100 కోట్లు), శ్రీ వైష్ణవ్‌ ఇస్పాత్‌ (రూ.82.52 కోట్లు), గతి ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ (రూ.42.86 కోట్లు) ఉన్నాయి. 

మరో ఆరు ఎన్‌పీఏ అకౌంట్లు బ్లాక్‌...
మరో ఆరు ఎన్‌పీఏ అకౌంట్లను ఎస్‌బీఐ  గత వారం బ్లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. వీటి విలువ రూ.1,307 కోట్లు. వీటి వేలం మార్చి 22న జరుగుతుందని బ్యాంక్‌ తెలిపింది. వీటిలో పేరెంటల్‌ డ్రగ్స్‌ (రూ.430 కోట్లు), కామాచీ ఇండస్ట్రీస్‌ (రూ.366 కోట్లు), జైన్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్‌ (రూ.362 కోట్లు), ఎంపీకే ఇస్‌పాత్‌, ఎంపీకే స్టీల్‌, ఎంపీకే మెటల్స్‌ (రూ.54 కోట్లు), బాల్‌ముకుంద్‌ పాలీప్లాస్ట్‌ (రూ.50 కోట్లు), మార్టినా బయోజనిక్స్‌ (రూ.46 కోట్లు) అకౌంట్లు ఉన్నాయి.



You may be interested

'వీడియోకాన్' యూనిటీ అప్లయెన్సెస్ ఆస్తుల విక్రయం

Wednesday 13th March 2019

న్యూఢిల్లీ: దాదాపు రూ. 154 కోట్ల రుణాలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన యూనిటీ అప్లయెన్సెస్‌ స్థిర, చరాస్తులను ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) వేలానికి ఉంచింది. 2018 జనవరి 5 నుంచి యూనిటీ అప్లయెన్సెస్ సంస్థ రూ. 153.77 కోట్లతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉందని బ్యాంకు తెలిపింది. ఈ సంస్థ తమిళనాడులోని సిప్‌కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఎయిర్ కండీషనర్లు, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలను

5.15 లక్షల కోట్లకు బ్యాంకు రుణాలు

Wednesday 13th March 2019

- 4.86 శాతం వృద్ధితో 4.33 లక్షల కోట్లకు డిపాజిట్లు - తెలంగాణ ఎస్‌ఎల్‌బీసీ వెల్లడి హైదరాబాద్‌ బిజినెస్‌ బ్యూరో: గతేడాది డిసెంబర్‌ చివరినాటికి తెలంగాణలోని మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.4,33,036 కోట్లకు చేరినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. 4.86% వృద్ధితో రూ.20,091 కోట్ల మేర డిపాజిట్లు పెరిగినట్లు తెలియజేసింది. ఈ కాలంలో మొత్తం అడ్వాన్సులు (రుణాలు) 7.28 శాతం పెరిగి రూ.5,15,537 కోట్లకు చేరుకున్నాయి. మంగళవారం ఇక్కడి

Most from this category