ముందుంది మాంద్యం!
By D Sayee Pramodh

శంకిస్తున్న యూఎస్ దిగ్గజ కంపెనీలు ప్రముఖ అనలిస్టులు సైతం 2009 తర్వాత తొలిసారి కంపెనీల ఎర్నింగ్స్ అంచనాలను తగ్గిస్తున్నట్లు సిటీ నివేదిక తెలిపింది. దీంతో ఈ ప్రభావం అంతర్జాతీయ ఎంఎస్సీఐ వరల్డ్ ఇండెక్స్ పీఈపై పడింది. ఈ సూచీ పీఈ తాజాగా 16 రెట్లు పతనమై పదేళ్ల సరాసరి పీఈ కన్నా 25 శాతం తక్కువకు చేరింది. మరోపక్క బాండ్ మార్కెట్ కూడా ఎకానమీలో బలహీనతలపై సంకేతాలిస్తోందని జేపీ మోర్గాన్ తెలిపింది. ఇందుకు తగ్గట్లే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లకు, జంక్ రేటెడ్ కార్పొరేట్ డెట్‌కు మధ్య వ్యత్యాసం పెరిగింది. ఈల్డ్ కర్వ్ తిరోగమించింది. అందువల్ల సంవత్సరంలో మాంద్యం వచ్చే అవకాశాలు 50 శాతం ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఎకానమీలో మాంద్యం మొదలైతే ఆ ప్రభావం భారత్‌పై కూడా ఉండొచ్చని ఎకనమిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఒక సంవత్సరంలోపు మరోమారు ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చని ప్రముఖ అమెరికన్ కంపెనీలు అనుమానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఈ కంపెనీలు తమ ఎర్నింగ్స్ అంచనాలను తగ్గిస్తున్నాయి. దీనికితోడు ఈల్డ్స్ గ్రాఫ్‌లో ట్రెండ్ కూడా మాంద్యానికి సంకేతాలిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు మాంద్యం తప్పదని భావిస్తున్నారు. గత మూడు నెలల్లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అనూహ్యంగా కిందకు దిగజారింది. ప్రపంచ జీడీపీ 2.5 శాతానికి పరిమితమయింది. దీంతో ఆపిల్, ఫెడెక్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, మాసీ, బ్లాక్‌స్టోన్ తదితరం కంపెనీలు పరోక్షంగా ఆర్థిక మందగమన హెచ్చరికలను జారీ చేశాయి. క్యు3 ఫలితాల విడుదల సందర్భంగా భవిష్యత్ లాభాల అంచనాలను కుదించాయి.
You may be interested
జీవితకాల గరిష్టానికి యాక్సిక్ బ్యాంక్
Thursday 17th January 2019ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ షేరు టార్గెట్ ధరను పెంచడంతో యాక్సిస్ బ్యాంక్ షేరు గురువారం 2శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్ఈలో షేరు రూ.668.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జనవరి 1 నుంచి కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అమితాబ్ చౌధరి బ్యాంకు అభివృద్ధికి గుణాత్మకమైన మార్పులు చేపడతారని కంపెనీ బ్రోకరేజ్ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో షేరు 15శాతం ఆదాయాన్ని సమకూరుస్తుందని
నష్టాల్లో మెటల్ షేర్లు
Thursday 17th January 2019ఒడిదుడుకుల మార్కెట్లో అత్యధిక శాతం మెటల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అరశాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్ గత ముగింపుతో పోలిస్తే 0.45శాతం నష్టపోయి 2,952.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లలో 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా 5 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా వెల్స్పన్ కార్పోరేషన్ లిమిటెడ్