STOCKS

News


ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా రాకేశ్‌ శర్మ బాధ్యతలు!

Thursday 11th October 2018
news_main1539231939.png-21038

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండీ, సీఈఓ)గా బుధవారం రాకేశ్‌ శర్మ బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌ 5న ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా శర్మ పేరును కేంద్రం ప్రకటించింది. ఆరు నెలలు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 2015 సెప్టెంబర్‌ 11 నుంచి 2018 జూలై 31వ తేదీ వరకూ శర్మ కెనరాబ్యాంక్‌ ఎండీ, సీఈఓగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అంతకుముందు 2014 ఏప్రిల్‌ 7 నుంచి 2015 సెప్టెంబర్‌ 9వ తేదీ వరకూ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.  చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తన కెరీర్‌ను ప్రారంభించిన శర్మ అటు తర్వాత లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ బదిలీ అయ్యారు. శర్మకు ముందు ఐడీబీఐ బ్యాంక్‌ చీఫ్‌గా బాద్యతలు నిర్వహించిన బీ. శ్రీరామ్‌, సెప్టెంబర్‌ 30వ తేదీన పదవీ బాధ్యతలు విరమించారు. జూన్‌ 30 నుంచీ మూడు నెలలు ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు. 



You may be interested

కాల్ కనెక్షన్‌ టైమ్‌పైనా ట్రాయ్ దృష్టి

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: టెల్కోలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా కాల్ కనెక్షన్ టైమ్‌, కాల్ మ్యూట్ అంశాలను కూడా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి చేర్చింది. అక్టోబర్ 1 నుంచి వీటికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు, తగు పరిష్కార మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. నంబర్ డయల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవడానికి

ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఈ-కేవైసీ..!

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలు ఆధార్‌ అడగకూడదని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆపరేటర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఆధార్‌కు బదులుగా ఈ-కేవైసీ ధృవీకరణకు అనుమతి ఇవ్వాలని టెలికాం శాఖ (డాట్‌)ను కోరారు. వెరిఫికేషన్‌ కోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ (యాప్‌)ను రూపొందిచిన ఆపరేటర్లు.. పేవర్‌ వర్క్‌ లేకుండా, క్షణాల్లోనే ధృవీకరణ పూర్తయ్యే విధంగా టెక్నాలజీని వివరించారని టెలికాం అపెక్స్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (యాక్ట్‌) ఒక లేఖ ద్వారా డాట్‌కు

Most from this category