STOCKS

News


ట్రంప్‌ దిగమన్నా దిగను!

Saturday 5th January 2019
news_main1546686816.png-23438

ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌
ఫెడ్‌ విధానాలపై అసంతృప్తితో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనను రాజీనామా చేయమన్నా, తాను చేయనని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్ల పెంపుదలపై ఇకనుంచి ఓపిగ్గా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్కెట్ల డౌన్‌సైడ్‌ రిస్కులను దృష్టిలో ఉంచుకొని ఇకమీదట సున్నితంగా వ్యవహరిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో యూఎస్‌ మార్కెట్లు ఒక్కమారుగా ఎగిశాయి. ఫెడ్‌ దూకుడుతో అమెరికా ఎకానమీ మరోమారు మందగమనం బాట పట్టవచ్చని భావిస్తున్న ఇన్వెస్టర్ల భయాలను పావెల్‌ తొలగించారు. ద్రవ్యోల్బణం ఇంకా తక్కువగానే ఉన్నందున రేట్ల పెంపుదల విషయంలో తొందరపడమని ఆయన చెప్పారు. దీంతో సూచీలతో పాటు ట్రెజరీ ఈల్డ్స్‌ సైతం బాగా లాభపడ్డాయి. మరోవైపు ఫెడ్‌ ఫండ్స్‌, డాలర్‌ బలహీనపడ్డాయి.

ఉద్దీపనల పథకాల ఉపసంహరణపై ముసురుకున్న అనుమానాలను పావెల్‌ కొద్దిగా ఉపశమింపజేశారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఫెడ్‌ మొండిగా వ్యవహరించేదని, పావెల్‌ వ్యాఖ్యలతో మార్కెట్‌ అభిప్రాయాలను పట్టించుకుంటామని ఫెడ్‌ చెప్పినట్లయిందన్నారు. సమస్యలను తొలగించకున్నా కొత్త సమస్యగా మారమని మార్కెట్లకు ఫెడ్‌ అభయమిచ్చినట్లయిందని అంచనా వేస్తున్నారు. విపరీతమైన, అనవసర భయాందోళనలతో గుడ్డిగా పతనమవుతున్న మార్కెట్లకు ఈ మాటలు వెలుగుచూపుతాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. 
 You may be interested

రూ.లక్ష పెట్టుబడి... రెండేళ్లలో రూ.32లక్షలు 

Sunday 6th January 2019

స్టాక్‌ మార్కెట్లో నష్టాలు ఎదురైనా... ఒక్క జాక్‌పాట్‌ అయినా కొట్టకపోతామా? అన్న ఆకాంక్షే నేరుగా పెట్టుబడుల వైపు ఆకర్షిస్తుంటుంది. అలాంటి మల్టీబ్యాగర్స్‌ కొన్నే ఉంటుంటాయి. ఆ కోవలోనిదే హెచ్‌ఈజీ లిమిటెడ్‌. నిజమే... రూ.లక్ష పెట్టుబడిని రెండేళ్లలో రూ.32 లక్షలు చేసింది ఈ కంపెనీ. గత ఏడాది కాలంలో మంచి పేరున్న కంపెనీల షేర్లు కూడా కకావికలం అయిన పరిస్థితిని చూశాం. అయినా హెచ్‌ఈజీ మాత్రం అల్లకల్లోల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లకు కాసులు

ఈ వారం ఎలా ఉండొచ్చు?

Saturday 5th January 2019

గత వారం మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లు చవిచూశాయి. నిఫ్టీ అధోముఖ వాలు రేఖ వద్ద పదే పదే నిరోధాన్ని ఎదుర్కొంది. వారమంతా యత్నించినా సూచీలు భారీ అప్‌మూవ్‌ జరపలేకపోయాయి. అయితే వారం మొత్తం మీద డెరివేటివ్స్‌లో భారీగా షార్ట్స్‌ పెరిగాయి. కానీ షార్ట్‌ కవరింగ్‌ మాత్రం జరగలేదు. ఈ వారం షార్ట్స్‌లో కవరింగ్‌కు ఛాన్సులున్నాయి. నిఫ్టీ గతవారాన్ని తన 50 రోజుల డీఎంఏ స్థాయి 10753 పాయింట్లకు దిగువన ముగించింది.

Most from this category