STOCKS

News


సెంట్రల్‌ బ్యాంకులకు నిర్వహణ స్వతంత్రత అవసరం

Saturday 15th December 2018
news_main1544848587.png-22946

వాషింగ్టన్‌: తమ బాధ్యతల నిర్వహణ విషయంలో సెంట్రల్‌ బ్యాంకులకు నిర్వహణపరమైన స్వతంత్రత అన్నది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) డైరెక్టర్‌ జెర్రీరైస్‌ అన్నారు. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాతో భారత ఆర్‌బీఐ స్వతంత్రత విషయమై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా, రైస్‌ స్పందించడం గమనార్హం. కొన్ని అంశాల విషయంలో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య కొంత కాలంగా విభేదాలు నెలకొనడం, ఉర్జిత్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం తెలిసిందే. ఆ తర్వాత శక్తికాంత దాస్‌ ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. తన అభిప్రాయాలు అంతర్జాతీయ అనుభవాల కోణం నుంచి చూడాలని రైస్‌ పేర్కొ‍న్నారు. సెంట్రల్‌ బ్యాంకులు వాటి బాధ్యతల నిర్వహణకు నిర్వహణ స్వతంత్రత అవసరమని అంతర్జాతీయ అనుభవం తెలియజేస్తోందన్నారు. ఆర్థిక స్థిరత్వం విషయంలో ఆర్‌బీఐ ఎంతో కీలక పాత్ర పోషించిందని, ఐఎంఎఫ్‌కు ఆర్‌బీఐ ముఖ్యమైన భాగస్వామి అని జెర్రీరైస్‌ పేర్కొన్నారు. డిప్యూటీ గవర్నర్‌గా ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యిత కార్యాచరణ రూపకల్పనలో, గవర్నర్‌గా దాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ఉర్జిత్‌ పటేల్‌ ముఖ్యపాత్ర పోషించినట్టు తాము భావిస్తున్నామని తెలిపారు. ఆర్‌బీఐ నూతన గవర్నర్‌ శక్తికాంతదాస్‌తో కలసి పనిచేసేందుకు వేచి చూస్తున్నట్టు చెప్పారు. 



You may be interested

జిల్లాల్లోనూ సీఎన్‌జీ స్టేషన్లు!

Saturday 15th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) స్టేషన్లు వివిధ జిల్లాల్లో కూడా ఏర్పాటు కానున్నాయి. వచ్చే మార్చి నాటికి హైదరాబాద్‌లో కొత్తగా 25, వరంగల్, కరీంనగర్‌ వంటి జిల్లాల్లో 15 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్‌ ఇండస్ట్రీ తెలంగాణ స్టేట్‌ లెవల్‌ కో–ఆర్డినేటర్‌ టి.రాజేశ్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. ఒక్క సీఎన్‌జీ స్టేషన్‌ ఏర్పాటుకు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని...

ఏటీఎంలు మూతపడవు: కేంద్ర ఆర్థిక శాఖ

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు సగం వరకు మూతపడే పరిస్థితి నెలకొందనే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన ఏటీఎంలైతే ఇప్పటివరకు మూసివేసే దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్ శుక్లా స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ 30 నాటికి దేశంలో మొత్తం 2.21 లక్షలు ఉండగా.. వీటిని షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్‌

Most from this category