STOCKS

News


ఒపెక్ చమురు ఉత్పత్తిలో కోత

Saturday 8th December 2018
news_main1544241381.png-22757

వియన్నా: చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌తో పాటు రష్యా తదితర భాగస్వామ్య దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని రోజుకు 12 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించాలని నిర్ణయించాయి. క్రూడాయిల్‌ రేట్ల పెరిగేందుకు, తద్వారా చమురు ఉత్పత్తి దేశాలకు మరింత అధికాదాయం సమకూరేందుకు ఇది ఉపయోగపడనుంది. శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఒపెక్‌లోని 14 దేశాలు రోజుకు 8 లక్షల బ్యారెళ్లు, రష్యా సహా మిగతా భాగస్వామ్య దేశాలు 4 లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఏప్రిల్‌లో దీన్ని పునఃసమీక్షిస్తాయి. రెండు నెలల వ్యవధిలో చమురు ధరలు 30 శాతం దాకా క్షీణించిన నేపథ్యంలో ఒపెక్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌.. చాలా ఈజీ!

Saturday 8th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యా రంగంలో స్టార్టప్స్‌ అంటే? స్కూల్‌ సిలబస్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి తీసుకొచ్చినవి.. ఆన్‌లైన్‌లో ఫీజులు, పాఠశాల నిర్వహణ చేసేవి.. లంచ్‌ బాక్స్‌లు అందించేవి..., స్కూల్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం కోసం రుణాలిచ్చేవి... ఇలా చాలా ఉన్నాయి. కానీ, దేశంలో తొలిసారిగా వ్యక్తిగత విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన ‘360 లెర్నింగే!’. అందులోనూ ఇంగ్లీష్, గణితం వంటి కీలక సబ్జెక్ట్స్‌ వర్క్‌షీట్స్‌ను కూడా అభివృద్ధి

విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల

Saturday 8th December 2018

ముంబై: విదేశీ మారక నిల్వలు నవంబర్‌ 30తో ముగిసిన వారంలో 933 మిలియన్‌ డాలర్ల మేర పెరిగి మొత్తం 393.71 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో నిల్వలు 795 మిలియన్‌ డాలర్ల మేర తగ్గి 392.78 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. విదేశీ మారక నిల్వల్లో అమెరికాయేతర కరెన్సీలు యూరో, పౌండ్‌, యెన్‌ నిల్వలు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. బంగారం నిల్వల విలువ 151.8 మిలియన్‌ డాలర్ల

Most from this category