STOCKS

News


వేడెక్కుతున్న చమురు ధర

Monday 22nd April 2019
news_main1555924852.png-25271

ఇరాన్‌- యూఎస్‌ సంక్షోభమే కారణం
సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 2 శాతం పైగా లాభపడ్డాయి. ఇరాన్‌ చమురు దిగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా, కొన్నిదేశాలకు తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. తాజాగా ఈ మినహాయింపులను ఉపసంహరించుకునేందుకు రెడీగా ఉందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది. దీంతో వారం ఆరంభంలో ఒక్కసారిగా చమురు ధరలు పైకి ఎగిశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ దాదాపు 74 డాలర్లకు చేరువైంది. డబ్ల్యుటీఐ క్రూడ్‌ 65 డాలర్లను దాటేసింది. సోమవారం సాయంత్రానికి అమెరికా నుంచి మినహాయింపుల ఉపసంహరణ ప్రకటన వస్తుందని అంచనాలు షికారు చేస్తున్నాయి. ఇరాన్‌నుంచి చమురు దిగుమతి చేసుకునే ఇండియా లాంటి దేశాలు ఇప్పటివరకు యూఎస్‌ నుంచి పొందిన మినహాయింపు పొడిగించమని, త్వరలో ఇరాన్‌తో చమురు దిగుమతులు ఆయా దేశాలు పూర్తిగా నిలిపివేయాలని, లేదంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సిఉంటుందని యూఎస్‌ ప్రకటన చేయనుంది. గత నవంబర్‌లో ఇరాన్‌పై యూఎస్‌ ఆంక్షలు విధించింది. ఆ సమయంలో ఎనిమిది దేశాలకు మినహాయింపులు ఇచ్చింది. వీటిలో చైనా, ఇండియాలు ప్రధాన దిగుమతిదారులు. ఈ గడువు మే2కు ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు పొడిగించేదిలేదని యూఎస్‌ స్పష్టం చేయనున్నట్లు సమాచారం. అయితే చైనా, ఇండియా మాత్రం గడువు పొడిగింపునకు లాబీయింగ్‌ చేస్తున్నాయి. ఈ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకపక్క ఒపెక్‌ ఉత్పత్తి కోతతో సరఫరా తగ్గిపోతుండగా, ఇప్పుడు ఇరాన్‌ చమురు సైతం లభించకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురుకు మరింత డిమాండ్‌ పెరగనుంది. ఈ కారణంగానే ఆయిల్‌ధరలు ర్యాలీ చేస్తున్నాయని ఎనర్జీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 2శాతం డౌన్‌

Monday 22nd April 2019

మార్కెట్‌ పతనంలో సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 30,282.50ల వద్ద ప్రారంభమైంది. అటు ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఇటు ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్ల పతనంతో ఇంట్రాడేలో 2శాతం నష్టపోయి 29,686.80  కనిష్టానికి పతనమైంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. మరో​ అరగంటలో

దేశంలో పెరిగి పసిడి ధర

Monday 22nd April 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 4నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో పసిడి ధర లాభాల బాట పట్టింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం పసిడికి మద్దతినిస్తుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.176.00 ర్యాలీ చేసి రూ.31639.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 6నెలల గరిష్టస్థాయికి చేరిన నేపథ్యంలో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40పైసలు నీరసించి 69.75 వద్ద

Most from this category