STOCKS

News


చల్లారుతున్న క్రూడ్‌ ధర

Saturday 23rd March 2019
news_main1553333095.png-24769

ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర మరో రెండు శాతం పతనమైంది. యూఎస్, చైనా ట్రేడ్‌ చర్చల్లో పురోగతి లేకపోవడం, జర్మనీ ఉత్పత్తి డేటా పేలవంగా ఉండడం, గ్లోబల్‌ ఎకానమీ నెమ్మదిస్తోందన్న ఫెడ్‌ అంచనాలు.. చమురు ధరలపై ‍ప్రభావం చూపాయి. దీంతో శుక్రవారం యూఎస్‌ సూచీలు సైతం భారీ నష్టాలను నమోదు చేశాయి. వారం ముగింపు వేళ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 67.30 డాలర్ల వద్ద క్లోజయింది. డబ్ల్యుటీఐ ఫ్యూచర్స్‌ 59.04 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారం చమురు ధర నాలుగునెలల గరిష్ఠాన్ని తాకిన సంగతి తెలిసిందే. కానీ ఈ అప్‌మూవ్‌ను నిలబెట్టుకోలేకపోయింది. జనవరి నుంచి చమురు ధరలు పాజిటివ్‌గా కదులుతూ ఇప్పటికి దాదాపు 20 శాతం మేర పుంజుకున్నాయి. ఒపెక్‌ ఉత్పత్తి కోత, ఇరాన్‌పై ఆంక్షలు, యూఎస్‌ చమురు నిల్వలు తగ్గుతుండడం లాంటివి క్రూడ్‌ధరకు ఊపునిచ్చాయి. కానీ ఈ వారం చివరలో వివిధ దేశాలు విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు చమురు ధరల ర్యాలీపై నీళ్లు జల్లాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ పీఎంఐ డేటా పేలవంగా కనిపించింది. వాణిజ్య చర్చల్లో కొత్త పురోగతి లేకపోవడం, ఆసియా, యూరప్‌ తదితర పలు ప్రాంతాల్లో వృద్ది నెమ్మదించడంతో చమురు డిమాండ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయని, అందుకే వారాంతంలో ధరలు పతనమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 



You may be interested

మోదీ మళ్లీ వస్తే నిఫ్టీ@ 13,000!

Saturday 23rd March 2019

ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ అంచనా మార్కెట్లో నెలకొన్న పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఏడాది మొత్తం కొనసాగవచ్చని ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ అనలిస్టు ఫొరమ్‌ పరేఖ్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలకు ముందే నిఫ్టీ 12 వేల పాయింట్లను తాకవచ్చని, ఒకవేళ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పక్షం మరలా గెలిస్తే నిఫ్టీ 13వేల పాయింట్లను చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ర్యాలీ మోదీ ప్రభుత్వం భారీ విజయం సాధిస్తుందన్న అంచనాలను డిస్కౌంట్‌ చేస్తోందన్నారు. ఈ ఏడాది

రెండు నెలల తర్వాత గడ్డుకాలం?

Saturday 23rd March 2019

మార్కెట్‌పై యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా దేశీయంగా కొనసాగుతున్న ర్యాలీ మరో రెండు నెలలు ఉండొచ్చని, కానీ ఆ తర్వాత వాల్యూషన్ల కారణంగా చల్లబడిపోతుందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌతం చచ్చోరియా అభిప్రాయపడ్డారు. తాజా అప్‌మూవ్‌తో రెండుమూడు నెలల్లో పలు స్టాకుల వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారతాయన్నారు. మోదీ ప్రభుత్వం మరోమారు విజయం సాధిస్తుందన్న నమ్మకం, లిక్విడిటీ వరద  ప్రస్తుత ర్యాలీకి ప్రధాన కారణాలన్నారు. ఈ కారణాలతో మరో రెండు నెలలు

Most from this category