STOCKS

News


హెచ్‌1బీ వీసా కొత్త ప్రతిపాదనలతో అనిశ్చితి: నాస్కామ్‌

Monday 3rd December 2018
news_main1543813594.png-22584

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసాల కోసం కంపెనీలు ముందుగానే ఎలక్ట్రానిక్‌ రూపంలో నమోదు చేసుకోవాలనే అమెరికా నూతన ప్రతిపాదనతో అనిశ్చితి పెరుగుతుందని, అక్కడి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సమాఖ్య ‘నాస్కామ్‌’ ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్‌1బీ వీసాలకు సంబంధించిన 139 పేజీల ప్రతిపాదనను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ప్రభావం అమెరికా కంపెనీలు, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని తమ అభిప్రాయాల రూపంలో తెలియజేస్తామని ప్రకటించింది. ట్రంప్‌ సర్కారు హెచ్‌1బీ వీసాల్లో భారీ మార్పులను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.  దీనిపై జనవరి 2 వరకు అభిప్రాయాలను స్వీకరిస్తామని అమెరికా అంతర్గత భద్రత విభాగం తన ప్రకటనలో తెలిపింది.‘‘కొత్త ప్రతిపాదనతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో తమ నైపుణ్య సేవలను అందించడం మరింత భారం అవుతుంది. వాటిపై ఆధారపడిన అమెరికా కంపెనీలను బలహీనపరుస్తుంది. అమెరికా ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది. ఐటీ సేవలను మరింతగా విదేశాలకు అవుట్‌సోర్స్‌ చేయడానికి దారితీస్తుంది’’ అని నాస్కామ్‌ పేర్కొంది.



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మె 10కి వాయిదా

Monday 3rd December 2018

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఈ నెల 3 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను 10వ తేదీకి వాయిదా వేసుకున్నారు. టెలికం శాఖ సెక్రటరీ అరుణ సుందర్‌రాజన్‌తో ఆదివారం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి. 4జీ స్పెక్ట్రం కేటాయింపు, పెన్షన్‌ పునఃపరిశీలన, , బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల తరఫున పెన్షన్‌ చందా విషయంలో ప్రగతి ఉన్నట్టు అన్ని ఉద్యోగ సంఘాలతో కూడిన ఏయూఏబీ తెలిపింది. వేతన

నవంబర్‌లోనూ అటో అమ్మకాలు నిదానమే

Monday 3rd December 2018

మారుతి, ఎంఅండ్‌ఎం, హోండా కార్ల అమ్మకాల్లో వృద్ధి టాటా, హ్యుందాయ్‌, టయోటా విక్రయాలు తగ్గుదల న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ నవంబర్‌లోనూ ఆటోమొబైల్‌ కంపెనీలకు ఆనందాన్నివ్వలేదు. స్థూల ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడంతో పండుగల విక్రయాలు జోరుగా సాగలేదు. ప్రధాన కంపెనీలైన మారుతి సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు పెరగ్గా, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, టయోటా విక్రయాలు తగ్గాయి. - మారుతి సుజుకి

Most from this category