STOCKS

News


మార్కెట్లలో మహా పతనం

Thursday 11th October 2018
news_main1539238400.png-21045

ప్రపంచవ్యాప్తంగా ఢమాల్‌మంటున్న ఈక్విటీలు
ట్రేడ్‌ వార్‌ టెన్షన్స్‌, ఫెడ్‌ రేట్లు కారణాలంటున్న నిపుణులు
బుధవారం అమెరికా మార్కెట్లలో ఆరంభమైన మార్కెట్‌ మంటలు ప్రపంచ మార్కెట్లన్నింటికీ వ్యాపించాయి. ఆస్ట్రేలియా నుంచి ఇండియా వరకు ఆసియా మార్కెట్లన్నీ గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 200 సూచీ 2 శాతం, జపాన్‌ నికాయ్‌ 4.4 శాతం, హాంకాంగ్‌ హ్యాంగ్‌సాంగ్‌ 3.7 శాతం, చైనా షాంఘై 4.4 శాతం, తైవాన్‌ టీఎస్‌ఈసీ సూచీ 6.3 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. దేశీయ సూచీల్లో సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్ల పైన, నిఫ్టీ దాదాపు 250 పాయింట్లపైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం డౌజోన్స్‌ 800 పాయింట్లపైగా నష్టంతో కీలక 26వేల స్థాయిని కోల్పోయింది. ఎస్‌అండ్‌పీ 500 సూచీ దీర్ఘకాలిక మద్దతు స్థాయి 2895ను నిలబెట్టుకోలేక పోయింది. ఫిబ్రవరి తర్వాత యూఎస్‌ మార్కెట్లు ఇంతలా పతనం కావడం ఇదే తొలిసారి. 

నిజానికి ఈక్విటీలు ఇంతలా పతనం కావడానికి ఎలాంటి ప్రేరక వార్తలు లేవని, కేవలం ఊహాగానాల కారణంగా ఈ పతనం సంభవించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ట్రేడ్‌వార్‌ కారణంగా కంపెనీల ఎర్నింగ్స్‌ దెబ్బతింటాయన్న భయాలు, ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఆర్థిక ఉద్దీపనలు ముగించడంపై అసంతృప్తులు, బాండ్‌ ఈల్డ్స్‌లో అనూహ్య పెరుగుదలలు.. ఇన్వెస్టర్లను అమ్మకాలకు ప్రేరేపించాయి. వడ్డీరేట్లను మరింత పెంచాలన్న ఫెడ్‌ ఆలోచనలపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. ఫెడ్‌ నిర్ణయం ఎకానమీలో వృద్ధికి విఘాతం కల్పించవచ్చని భయపడుతున్నారు. ఇన్వెస్టర్లలో భయాలకు అద్దం పట్టే వీఐఎక్స్‌ సూచీ 44 శాతం పెరిగి 23 స్ధాయిల వద్దకు చేరింది. నిజానికి ఈ పతనం ఊహించినదేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. వాల్యూషన్లు దిగిరావడానికి ఈ కరెక‌్షన్‌ ఉపయోగపడుతుందంటున్నారు. 

వర్ధమాన మార్కెట్లు తాజా పతనంతో ఏప్రిల్‌స్థాయిలకు దిగివచ్చాయి. ఇదే సమయంలో ఈ దేశాల కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే దీర్ఘకాలిక కనిష్ఠాలకు పతనమయ్యాయి. తాజా పతనం మరికొంత కాలం కొనసాగే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ గురువారం భారీ నష్టాల్లో కనిపిస్తున్నాయి. 

ఫెడ్‌ వరుసగా వడ్డీరేట్లు పెంచుకుంటూ పోవడంపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ సైతం అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫెడ్‌ తప్పు చేస్తోందని ఆయన విమర్శించారు. ఫెడ్‌ మరీ కఠినంగా వ్యవహరిస్తోందని, మరీ ఇంతలా శివాలెత్తడం మంచిది కాదని దుయ్యబట్టారు. తాజా పతనం మార్కెట్లకు మంచిదేనని, కానీ ఫెడ్‌ నిర్ణయాలతో మాత్రం తాను ఏకీభవించనని చెప్పారు. ఎప్పటి నుంచో రేట్లను తగ్గించాలని ఫెడ్‌పై ట్రంప్‌ ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మరోవైపు నానాటికీ పెరిగిపోతున్న ట్రేడ్‌వార్‌ టెన్షన్లు సైతం తాజా పతనానికి కారణమయ్యాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌- చైనా వాణిజ్య సంబంధాలు మరింత దిగజారే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. చైనా ఉద్దేశపూర్వకంగా తన కరెన్సీని డీవాల్యూ చేస్తోందని యూఎస్‌ విమర్శించింది. ఇరు దేశాల మధ్య మరికొంత కాలం ఘర్షణాపూరిత వాతవరణమే కనిపించనుందని నిపుణుల అంచనా. You may be interested

కళతప్పిన మెటల్‌ షేర్లు

Thursday 11th October 2018

మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా గురువారం మెటల్‌ షేర్లు కళతప్పాయి. అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లలో నెలకొన్న అ‍మ్మకాల్లో భాగంగా నేటి ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా దాదాపు 5శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.76శాతం నష్టపోయి 3,309.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లోని జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. టాటాస్టీల్‌ 5శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో

పెరిగిన పసిడి ధర

Thursday 11th October 2018

అంతర్జాతీయ మార్కెట్లో గురువారం పసిడి ధర పెరిగింది. ప్రపంచమార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవ్వడం, డాలర్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమయ్యాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం 10:30ని.లకు ఔన్స్‌ పసిడి 3.30డాలర్లు పెరిగి 1,196.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోవడంతో, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు యెన్‌ కరెన్సీ నేడు

Most from this category