STOCKS

News


ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు

Monday 24th December 2018
news_main1545625917.png-23193

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో జరగనున్నాయి. దీనికి మన దేశం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతోపాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ కిమ్‌ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహంచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్‌ కారణంగా ఉద్యోగ నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లౌస్‌ష్వాబ్‌ పేర్కొన్నారు. ప్రపంచీకరణ శిఖర స్థాయికి చేరిందని, అయినప్పటికీ అంతర్జాతీయ ఏకీకరణ కొనసాగుతుందన్నారు. 
కేటీఆర్‌, లోకేష్‌ సైతం...
భారత్‌ నుంచి పాల్గొనే వారిలో అరుణ్‌జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్‌ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమారుడు, కేటీఆర్‌ సైతం హాజరు కానుండడం ఆసక్తికరం. వ్యాపార ప్రముఖులు అజీమ్‌ ప్రేమ్‌జీ, ముకేశ్‌ అంబానీ దంపతులు, ఉదయ్‌ కోటక్‌, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్‌, నందన్‌ నీలేకని, ఆనంద్‌ మహీంద్రా, అజయ్‌ పిరమల్‌ కూడా పాలు పంచుకోనున్నారు. 



You may be interested

ఒకేసారి మొత్తం ఫండ్లలో పెట్టొద్దు!

Monday 24th December 2018

‘‘మ్యూచ్‌వల్‌ ఫండ్లలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయటం సరికాదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్లు కాకుండా బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు ఎంచుకోండి. అన్నిటికన్నా సిప్‌ విధానం ఉత్తమం. కాకపోతే జీతం పెరిగినపుడు సిప్‌ మొత్తాన్ని ఏ మేరకు పెంచాలనేది మీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ ఇన్వెస్టర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు ప్రముఖ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ విశ్లేషకుడు ధీరేంద్ర కుమార్‌. వారి ప్రశ్నలు, వాటికి ఆయనిచ్చిన సమాధానాలు ఇవిగో... ప్ర: నేను మ్యూచువల్‌

35,540 దిగువన డౌన్‌ట్రెండ్‌

Monday 24th December 2018

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ మార్కెట్‌...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్‌కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్‌లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్‌ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ

Most from this category