STOCKS

News


‘జాక్‌ మా’ వరసుడిగా డేనియల్ జాంగ్

Tuesday 11th September 2018
news_main1536641752.png-20148

బీజింగ్‌: అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు జాక్‌ మా వెల్లడించారు. 420 బిలియన్‌ డాలర్ల (30,43,131 కోట్లు) ఈ-కామర్స్ దిగ్గజానికి తన తరువాత వరసుడిగా ప్రజాదరణ పొందిన ‘సింగిల్‌ డే సేల్‌’ ప్రచార రూపకర్త సీఈఓ డేనియల్ జాంగ్‌ను ప్రకటించారు. సోమవారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన జాక్‌ మా.. వచ్చే ఏడాది సెప్టెంబరు 10న జాంగ్‌ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపడతారని తెలియజేశారు. 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. ఇక నుంచి భవిష్యత్‌ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. 



You may be interested

చౌక్సీ కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు.. ఇంటర్‌పోల్‌కు ఈడీ ‘రిమైండర్’

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: ఆభరణాల వర్తకుడు మెహుల్‌ చోక్సీకోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా ఇందుకు సంబంధించి మరో ‘రిమైండర్‌ నోటీసు’ పంపింది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర మోసం చేసి, చోక్సీ దేశం నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలని జూన్‌లో (ముంబై కోర్టులో చోక్సీపై ఈడీ

రూపాయి పతనం కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగెటివ్‌’

Tuesday 11th September 2018

హెడ్జింగ్‌ వంటి చర్యలు తీసుకుంటే భయం లేదు: మూడిస్‌ న్యూఢిల్లీ: రూపాయి అదే పనిగా విలువను కోల్పోతుండడంతో... రూపాయిల్లో ఆదాయం గడిస్తూ, అదే సమయంలో డాలర్ల రూపంలో రుణాలను తీసుకున్న కంపెనీలకు ‘క్రెడిట్‌ నెగెటివ్‌’(రుణాల పరంగా ప్రతికూల స్థితి) అని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడిస్‌ పేర్కొంది. ఈ ఏడాది రూపాయి ఇంత వరకు డాలర్‌తో 13 శాతం క్షీణించింది. ‘‘అయితే, చాలా వరకు అధిక రేటింగ్‌ కలిగిన భారత

Most from this category