STOCKS

News


70 డాలర్లను దాటదు!

Saturday 8th December 2018
news_main1544267277.png-22776

క్రూడాయిల్‌ ధరపై వందనా హరి అంచనా
ఒకపక్క ట్రంప్‌ ట్వీట్లను పట్టించుకున్నామని చెబుతూనే సౌదీ అరేబియా ఉన్నట్లుండి చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోమారు క్రూడాయిల్‌ ధరల ర్యాలీ ఉండొచ్చన్న భయాలు పెరిగాయి. కానీ ఇవన్నీ నిరర్ధకాలేనని, క్రూడాయిల్‌ ధర 70- 75 డాలర్లను దాటకపోవచ్చని ప్రముఖ విశ్లేషకురాలు వందనా హరి అంచనా వేస్తున్నారు. సౌదీ ప్రకటన వెనుక చాలా కసరత్తు జరిగిందని, ట్రంప్‌కు కోపం రాకుండా ఉండేందుకు సౌదీ యత్నిస్తోందని అభిప్రాయపడ్డారు. అందుకే కోతతో సంబంధం లేకుండా మార్కెట్లో చమురు కొరత లేకుండా చూస్తామని సౌదీ మంత్రి అల్‌ ఫలిహ్‌ చెప్పారని ఆమె విశ్లేషించారు. కేవలం ట్రంప్‌ వైఖరి మాత్రమే కాకుండా మోదీ యత్నాలు కూడా సౌదీపై పని చేశాయన్నారు. అందుకే ఉత్పత్తికోత అనే సమాచారాన్ని అత్యంత జాగ్రత్తగా వెలుబుచ్చారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ ఒక్కటి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని, తాజా ప్రకటన వెనుక పలు దేశాల చర్చలు, సంప్రదింపులు ఉండిఉంటాయని తెలిపారు. 
ఖతార్‌, ఇరాన్‌ లేకుండా..
వచ్చే జనవరి నుంచి ఒపెక్‌ నుంచి బయటకు వస్తామని ఖతార్‌ ప్రకటించింది. మరోపక్క చమురు కోతలకు ఇరాన్‌ పెద్దగా సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో రష్యాతో కలిసి ఒపెక్‌ గతంలోలాగా ప్రపంచ ఇంధన రంగంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో వేచిచూడాలని వందన చెప్పారు. గతంలో కోత నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని తప్పనిసరి నిబంధనలను పెట్టుకున్నాయని, కానీ ఇప్పుడా నిబంధనలు బలహీనంగా ఉన్నాయని తెలిపారు. అయినా ఒపెక్‌ నిర్ణయాన్ని ఇతర దేశాలు సమర్ధించవని అనుకోవడానికి లేదన్నారు. కానీ స్థూలంగా చూస్తే మార్కెట్లు ఇప్పటికే క్రూడాయిల్‌ ఉత్పత్తి కోత నిర్ణయాన్ని జీర్ణించుకున్నాయని ఆమె చెప్పారు. అందువల్ల ఇప్పటికిప్పుడు చమురు ధరలు భారీగా పెరిగే ఛాన్సుల్లేవన్నారు. ఒకవేళ మరీ ఒత్తిడి ఎక్కువైతే 80 డాలర్లకు చేరవచ్చు కానీ అంతకుమించి పెరగకపోవచ్చన్నారు. అదేవిధంగా క్రూడ్‌ ధర 50 డాలర్లకు పతనమయ్యేంత మందగమన పరిస్థితులు కూడా లేవని, మొత్తం మీద 70 డాలర్లకు అటుఇటుగా ఉండొచ్చని చెప్పారు. ముడిచమురు విషయమై ఇండియా కొన్నాళ్లు ఆందోళన పడాల్సిన అవసరం రాకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. You may be interested

బీమా కొనుగోలు సరిగ్గా ఉందా..?

Sunday 9th December 2018

ఎవరైనా కానీ జీవితంలో సంపాదన ప్రారంభించిన తర్వాత చేయాల్సిన మొదటి పని బీమా పాలసీ తీసుకోవడం. అయితే, ఎంత మంది బీమా తీసుకుంటున్నారు? తీసుకునే వారిలోనూ ఎంత మంది సరిగ్గా తీసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే కనుక సమాధానం సంతృప్తిగా ఉండకపోవచ్చు. నష్టం జరిగితే (అది ప్రాణ, ఆస్తి నష్టం కావచ్చు) అందుకు చెల్లించే పరిహారం బీమా. బీమా కంపెనీ అందిస్తున్న అన్ని ఉత్పత్తులూ అందరికీ సరిపడకపోవచ్చు. ప్రకటనలు, ఏజెంట్ల మాటలు,

5నెలల గరిష్టానికి పసిడి ధర

Saturday 8th December 2018

ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల పెంపుపై అనుమానాలు రేకెత్తడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం 5నెలల గరిష్టానికి చేరుకుంది. రాత్రి అమెరికా విడుదల చేసిన నవంబర్‌ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ నెలలో 195,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆర్ధికవేత్తలు అంచనావేయగా, కేవలం 155,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగినట్లు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ గణాంకాలను విడుదల చేసింది. వ్యవస్థలో ఉపాధి కల్పన మందిగించడంతో

Most from this category