STOCKS

News


సుంకాల వివాదాలపై డబ్ల్యూటీవో ప్రత్యేక కమిటీ

Wednesday 5th December 2018
news_main1543984573.png-22639

న్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియం దిగుమతి సుంకాల విషయంలో అమెరికాతో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న భారత్ అభ్యర్థనపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సానుకూలంగా స్పందించింది. కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. నిర్దిష్ట ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలు అంతర్జాతీయ ఒడంబడికలకు అనుగుణంగా ఉన్నాయా లేక విరుద్ధంగా ఉన్నాయా అన్న అంశాన్ని ఇది పరిశీలిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఏదైనా వివాదం పరిష్కారం కాకపోతే.. ప్రత్యేక పానెల్‌ను ఏర్పాటు చేయాలంటూ డబ్ల్యూటీవోని సభ్య దేశాలు కోరవచ్చు. ఏటా 1.6 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. దేశ ప్రయోజనాల పరిరక్షణ పేరుతో వీటిపై అమెరికా సుంకాలు విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ డబ్ల్యూటీవోని ఆశ్రయించడంతో పాటు అమెరికా నుంచి దిగుమతయ్యే 29 ఉత్పత్తులపై సుంకాలను పెంచాలని భారత్ నిర్ణయించింది. ఇవి డిసెంబర్ 17 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్‌తో పాటు రష్యా, మెక్సికో, కెనడా తదితర దేశాలు కూడా దిగుమతి సుంకాల పెంపు విషయంపై అమెరికా మీద డబ్ల్యూటీవోకి ఫిర్యాదు చేశాయి. 



You may be interested

ఈపీఎఫ్‌వో ఫండ్‌ మేనేజర్‌గా తప్పుకోనున్న ఎస్‌బీఐ

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఫండ్‌ మేనేజర్‌గా ఎస్‌బీఐ సంస్థ మార్చి నుంచి తప్పుకోనుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఓ బ్యాంకు అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీగా వ్యవహరించడానికి వీల్లేదు. ‘‘ఫండ్‌ మేనేజర్‌గా పనిచేయడానికి లేదని ఎస్‌బీఐకి తెలియజేశాం. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌తో ఒప్పందం లేదు. గతంలో బిడ్డింగ్‌ వేసే నాటికి ఆ సంస్థ దరఖాస్తుదారుగా లేదు’’ అని కార్మిక శాఖా మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. మంగళవారం ఈపీఎఫ్‌వో సెంట్రల్‌

ఎంఎస్‌ఈ రంగానికి రూ.1.23 లక్షల కోట్ల రుణాలు

Wednesday 5th December 2018

ముంబై: చిన్న వ్యాపార సంస్థల(ఎంఎస్‌ఈ)కు రుణాల లభ్యతపై నెలకొన్న ఆందోళలన్నీ భ్రమలేనని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఈ రంగానికిచ్చే రుణాల్లో మంచి వృద్ధి ఉందని స్పష్టం చేశారు. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎంఎస్‌ఈ రంగానికి ఇచ్చే రుణాలు 1.23 లక్షల కోట్లకు పెరిగాయని, జీఎస్టీకి ముందున్న రూ.25,700 కోట్లతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగినట్టు మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. జీఎస్టీకి ముందు చిన్న

Most from this category