STOCKS

News


చైనాతో తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం

Wednesday 10th July 2019
news_main1562742620.png-26950

  • ఈ ఏడాది ఐదు నెలల్లో 3.59 శాతం తక్కువ

బీజింగ్‌: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో చైనాతో, మన దేశ ద్వైపాక్షిక వాణిజ్యం 3.59 శాతం తగ్గి 36.87 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు చైనా కస్టమ్స్‌ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వాణిజ్య లోటు 2017లో 51.72 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, అది 2018లో 57.86 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. తొలి ఐదు నెలల్లో చైనాకు భారత ఎగుమతులు 1.62 శాతం తగ్గి 7.70 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, భారత్‌కు చైనా ఎగుమతులు 4.10 శాతం తగ్గి 29.17 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా మే నెలలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా 5.04 శాతం మేర తగ్గి 8.18 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం 95 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది చారిత్రక గరిష్ట స్థాయి. దీంతో 2019లో ఇది తొలిసారిగా 100 బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఇరు దేశాలూ వ్యక్తం చేశాయి. అయితే, తాజా గణాంకాలు ఈ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. 
ఎగుమతులు ఇవే... 
2019 జనవరి-మే మధ్య కాలంలో మన దేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో ఆర్గానిక్‌ కెమికల్స్‌ 23.56 శాతం, కాటన్‌ 50.73 శాతం, ప్లాస్టిక్స్‌ 25.48 శాతం, చేపలు, సముద్ర ఉత్పత్తులు 395 శాతం, ఎలక్ట్రికల్‌ మెషినరీ 33.5 శాతం, ఐరన్‌, స్టీల్‌ 39 శాతం చొప్పున తొలి ఐదు నెలల్లో వృద్ధి చెందాయి. ద్రాక్ష ఎగుమతులు 165 శాతం పెరిగి 13.26 బిలియన్‌ డాలర్ల మేర జరిగాయి. ఇక, ముత్యాలు, ఖరీదైన రత్నాలు, కాపర్‌, మినరల్‌ ఫ్యూయల్‌ ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో క్షీణించాయి. చైనా నుంచి ఎరువుల దిగుమతులు 233 శాతం పెరిగి 512 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 



You may be interested

బ్యాంకుల్లో రూ.1.85 లక్షల కోట్ల మోసాలు

Wednesday 10th July 2019

11 ఏళ్లలో నమోదైన కేసులు 44,016 న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో గత పదకొండు ఏళ్లలో (2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు) 44,016 మోసం కేసులు నమోదు కాగా, వీటి ప్రభావం రూ.1,85,624 కోట్లుగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. అత్యధికంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 25,883 కోట్లకు సంబంధించి 3,927 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం 2017-18లో

టీసీఎస్‌ షేరును ఏంచేద్దాం?

Wednesday 10th July 2019

జూన్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ ఫలితాలు అంచనాల కన్నా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ షేరుపై మిశ్రమ రికమండేషన్లు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు టీసీఎస్‌ను కొనొచ్చని చెబుతుంటే, మరికొన్ని అట్టిపెట్టుకోమని, కొన్నేమో వదిలించుకోమని సూచిస్తున్నాయి. ఫలితాల నేపథ్యంలో షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. మోర్గాన్‌ స్టాన్లీ: ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 1980. ఫలితాల్లో ఆదాయ వృద్ధి అంచనాలను అందుకోలేదు. అయితే

Most from this category