STOCKS

News


భారత్ సుంకాలపై ట్రంప్ గుర్రు..

Monday 4th March 2019
news_main1551672547.png-24413

  • దీటుగా తామూ టారిఫ్‌లు పెంచాల్సి ఉంటుందని వ్యాఖ్యలు

వాషింగ్టన్‌:  అమెరికన్ ఉత్పత్తులపై భారత్‌ భారీ సుంకాలు విధిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు."అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో" భారత్ కూడా ఒకటని, ప్రతిగా తాము కూడా భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదే స్థాయిలో సుంకాలు విధించాలని లేదా కనీసం "ఎంతో కొంత, ఏదో ఒక ట్యాక్స్" అయినా విధించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌ (సీపీఏసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ .. తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. "భారత్ మనమీద చాలా భారీగా టారిఫ్‌లు విధిస్తుంది. అమెరికాలో తయారైన మోటార్‌సైకిల్‌ను అక్కడికి ఎగుమతి చేస్తే మన మీద 100 శాతం టారిఫ్‌లు విధిస్తోంది. అదే అక్కణ్నుంచి ఇక్కడికి వచ్చే మోటార్‌ సైకిల్‌పై మనం అసలేమీ వసూలు చేయడం లేదు. కాబట్టి, ఇప్పటికైనా వారు విధించే దానికి సరిసమానంగానో లేదా ఎంతో కొంత అయినా ట్యాక్స్ విధించాల్సిందే" అని ట్రంప్ పేర్కొన్నారు. 


 అమెరికన్ ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు విధించే దేశాల గురించి మాట్లాడుతూ.. ట్రంప్ ప్రధానంగా భారత్‌నే ఉదహరించడం గమనార్హం. "ఉదాహరణకు భారత్‌ చాలా భారీగా ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తుంది. సరే.. మనం అంత వద్దు.. కనీసం 25 శాతమైనా విధిద్దామని ప్రతిపాదించా. కానీ దీనిపై విపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. వాస్తవానికి వంద శాతం టారిఫ్‌లు వేయాల్సినప్పటికీ 25 శాతానికే పరిమితం కావడం మూర్ఖత్వమే. అయినప్పటికీ.. వారి మాటకు గౌరవమిచ్చి తక్కువ స్థాయిలో ప్రతిపాదించినా.. దానికీ వారు మోకాలడ్డుతున్నారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన ప్రతిపాదనలకు మద్దతివ్వాలని కోరారు. హార్లే డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్స్‌ విషయంలో భారత్‌ టారిఫ్‌లపై ట్రంప్ గతంలో కూడా ఇలాంటి విమర్శలే చేసిన సంగతి తెలిసిందే.You may be interested

అనధికారిక సర్‌చార్జీలతోనే డిజిటల్ చెల్లింపులకు విఘాతం

Monday 4th March 2019

ఐఐటీ ముంబై అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: అనధికారిక సర్‌చార్జీలు, మర్చంట్ డిస్కౌంట్ రేట్లలో (ఎండీఆర్‌) వ్యత్యాసాలు మొదలైనవే దేశీయంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ప్రతిబంధకాలుగా ఉంటున్నాయని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ ముంబై ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇలాంటి వాటివల్ల చిన్న/మధ్య స్థాయి వ్యాపారులు, కస్టమర్లు నష్టపోతున్నారని, ఫలితంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదని తెలిపింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ఎ౾ండీఆర్‌ల మధ్య వ్యత్యాసాల

భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!

Monday 4th March 2019

సోమవారం మార్కెట్‌కు సెలవు మంగళవారం నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ వెల్లడి- బుధవారం యూఎస్‌ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా- యూఎస్‌ నాన్‌ ఫామ్ పేరోల్స్ గణాంకాలు ఈవారంలోనే.. ముంబై: భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను వాఘా సరిహద్దు దగ్గర పాక్‌ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. పైలట్‌ను తిరిగి అప్పగించడంతో భారత్-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకు తగ్గి దాయాదుల మధ్య

Most from this category