News


సంస్కరణలను కొనసాగించాల్సిందే

Thursday 4th October 2018
news_main1538627091.png-20844

వాషింగ్టన్‌: సంస్కరణల మార్గం తప్పుతున్న దేశాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) బుధవారం హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భద్రత తగ్గుతుందని, స్థిరత్వం అపాయంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారంతో సంస్కరణలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత పదేళ్ల కాలంలో సంస్కరణల తీరు, భవిష్యత్తుకు సంబంధించి ఓ నివేదికను ఐఎంఎఫ్‌ విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 10 ఏళ్ల కాలంలో ప్రగతి స్పష్టంగా ఉందంటూ, సంస్కరణల అంజెడా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. సంస్కరణలను ఉపసంహరించుకుంటే, రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్‌ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇది నియంత్రణ, పర్యవేక్షణ మరింత పడిపోయేందుకు దారితీస్తుందని అభిప్రాయపడింది. సైబర్‌ సెక్యూరిటీ రిస్క్‌ పెరగడం వల్ల ఆర్థిక సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని... ఈ విషయంలో నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు సదా అప్రమత్తంగా ఉండి, అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్‌ సూచించింది. 



You may be interested

‘రూపాయి’ కారణంగా కొత్త స్మార్ట్‌ఫోన్లు

Thursday 4th October 2018

దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం, దిగుమతులపై ఆధారపడిన వస్తు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఒక డాలర్‌ కొనాలంటే తాజాగా 73.34 రూపాయలు చెల్లించాలి. కానీ, ఈ ఏడాది జనవరి 1న డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.88. 2018లో ఇంత వరకు 14 శాతం నష్టపోయింది. దీంతో దిగుమతి ఆధారిత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే కాక పుట్టిస్తుండగా, మరోవైపు బంగారం ధర కూడా రేజింగ్‌లో ఉంది.

టెల్కోల ఆదాయం 10% డౌన్‌

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: టెలికం సర్వీసుల ద్వారా ఆపరేటర్ల స్థూల ఆదాయం (జీఆర్) ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10 శాతం తగ్గుదలతో రూ.58,401 కోట్లకు క్షీణించింది. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) 8.11 శాతం తగ్గి రూ.36,552 కోట్లుగా నమోదైనట్లు టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. త్రైమాసికం పరంగా జీఆర్ 6.10 శాతం, ఏజీఆర్‌ 2.40 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఏజీఆర్‌లో ప్రధాన భాగమైన సర్వీసుల విక్రయ

Most from this category