News


ఆయిల్‌ డిమాండ్‌ అంతంతే!

Friday 14th June 2019
news_main1560507293.png-26300

అంచనాలు తగ్గించిన ఐఈఏ

ఈ ఏడాది ఆయిల్‌ డిమాండ్‌ పెరుగుదల తక్కువగా ఉంటుందని ఇంటర్నెషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ(ఐఈఏ) శుక్రవారం అంచనా వేసింది. ప్రపంచ వాణిజ్యం అధ్వానంగా ఉండడంమే దీనికి కారణమని తెలిపింది. అయితే ఉద్ధీపన ప్యాకేజీలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి కారణంగా 2020లో చమురు డిమాండ్‌లో వృద్ధి ఉండొచ్చని తెలిపింది. 2019 రోజూవారీ డిమాండ్‌ పెరుగుదలను రోజుకు 12 కోట్ల బ్యారెల్‌గా అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాలను 10 కోట్ల డాలర్లకు తగ్గించింది. అయితే 2020లో ఈ డిమాండ్‌ 14 కోట్ల బీపీడీకు పెరుగుతుందని తెలిపింది. ‘ఎకనామిక్‌ సెంటిమెంట్‌ బలహీన పడుతున్న తరుణంలో ఆయిల్‌ డిమాండ్‌ కూడా బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఐఈఏ తన నివేదికలో తెలిపింది.ప్రపంచమంతా వాణిజ్యం అధ్వాన్నంగా ఉందని,  ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో పేలవంగా ఉన్న డిమాండ్‌ పెరుగుదల యూరప్‌లోని పెట్రోకెమికల్‌ ఇండస్ట్రీస్‌ మందగమనానికి కారణం అయ్యిందని నివేదికలో వివరించింది. దీం‍తో పాటు ఉత్తరార్ధగోళంలో  సగటు వాతవరణం కంటే వేడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో యూఎస్‌లో గ్యాసలిన్, డీజిల్‌ డిమాండ్‌ బాగా తగ్గింది.

ఉద్దీపనలే కాపాడాలి!

ప్రభుత్వాలు ఆర్థిక మందగమన నివారణ చర్యలు చేపట్టడం, అభివృద్ధి చెందని దేశాలలో ఇంధన వినియోగాన్ని పెంచడం వలన ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో డిమాండ్‌ 16 కోట్ల బీపీడీకి పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఉద్దీపన ప్యాకేజీల వలన కొంత కాలం వరకు ఆయిల్‌ డిమాండ్‌ పెంచవచ్చని, దీంతో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డి రేట్ల పెరుగుదలను ఆపేయ్యడం లేదా తగ్గించడం కానీ చేస్తే 2019 ద్వితీయార్ధం, 2020లో డిమాండ్‌ పెరుగుదల ఉండొచ్చని అంచనా వేసింది. ఇరాన్, వెనుజులపై అమెరికా ఆంక్షాలు, ఒపెక్‌ దేశాల ఆయిల్‌ ఉత్పత్తి తగ్గింపులు, లిబియా అంతర్గత యుద్దం, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు చమురు సరఫరాలో ఆనిశ్చితికి కారణాలని ఐఈఏ వివరించింది. నాన్‌ ఒపెక్‌ దేశాలైన అమెరికా, బ్రెజిల్, కెనడా, నార్వే వంటి దేశాలలోని ఆయిల్‌ ఉత్పత్తులు పెరగడం, ప్రపంచంలోని నాన్‌ఒపెక్‌ చమురు సరఫరాలో పెరుగుదలకు(ఈ ఏడాది 1.9 మిలియన్‌ల బీపీడీ, 2020లో 2.3 మిలియన్లు) సహాయపడతాయని ఐఈఏ తెలిపింది.



You may be interested

ఆరు షేర్లపై మోర్గాన్‌స్టాన్లీ ఓవర్‌వెయిట్‌

Friday 14th June 2019

దేశీయ మార్కెట్లో ఆరు స్టాకులపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. 1. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: టార్గెట్‌ రూ. 1525. డొమినాస్‌ పిజ్జామేకరైన ఈ సంస్థ లాంగ్‌టర్మ్‌ వృద్ధిపై ధీమాగా ఉంది.వ్యయ నియంత్రణకు సాంకేతికాభివృద్ధిని వినియోగిస్తోంది. బంగ్లాదేశ్‌లో విస్తరణపై నమ్మకంగా ఉంది. 2. యాక్సిస్‌బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1100. దేశీయ వృద్ధి బలంగా 15- 18 శాతం వరకు ఉండొచ్చు. కాస్ట్‌ రేషియో మెరుగుదల సరైన దిశలోనే ఉంది. వచ్చే

మరో 2-3 ఏళ్ల పాటు మార్కెట్లో ర్యాలీ

Friday 14th June 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లో మరో 2-3 ఏళ్ల ర్యాలీ కొనసాగుతుందని ఆనంద్‌ రాఠి షేర్స్‌, స్టాక్‌ బ్రోకర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ సేదాని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల ఎన్‌డీఏ పాలనకాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన, జీఎస్టీ అమలు, మౌలికరంగ సదుపాయాల అభివృద్ది కార్యకలాపాలతో పాటు వ్యవస్థలో కీలకమైన పాలసీలను ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధికి పునాది పడిందని సేదాని అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్‌డీఏ మానిఫెస్టోలో ప్రకటించిన కొత్త పథకాలు

Most from this category