ఏటీఎఫ్‌పై తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ
By Sakshi

న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన ఇంధనంగా పిలిచే ఏటీఎఫ్‌పై డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా తగ్గింపు అక్టోబరు 11 (బుధవారం) నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.74.56 వద్ద ఉంది. ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది జులై నుంచి ఇప్పటివరకు విమాన ఇంధన ధర 58.6 శాతం పెరిగింది.
You may be interested
ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియకు అనుమతి
Thursday 11th October 2018సాక్షి, హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.489.77 కోట్లు చెల్లించకుండా ఎగవేసినందుకు ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) హైదరాబాద్‌కు చెందిన గోవిందరాజుల వెంకట నర్సింహారావును నియమించింది. ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియకు సంబంధించి
కాల్ కనెక్షన్ టైమ్‌పైనా ట్రాయ్ దృష్టి
Thursday 11th October 2018న్యూఢిల్లీ: టెల్కోలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా కాల్ కనెక్షన్ టైమ్, కాల్ మ్యూట్ అంశాలను కూడా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి చేర్చింది. అక్టోబర్ 1 నుంచి వీటికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు, తగు పరిష్కార మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. నంబర్ డయల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవడానికి