STOCKS

News


బంగారం.. ర్యాలీకి రెడీ!

Saturday 9th March 2019
Markets_main1552113329.png-24501

అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం ధర పెద్దగా మార్పులేకుండా 1280 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ వృద్ధి అంచనాలు తిరోగమనం పడుతున్న సంకేతాలు వస్తున్నందున ఇకపై బంగారం ధర దూసుకుపోయే ఛాన్సులున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే పలు దేశాల కేంద్ర బ్యాంకులు మానిటరీ పాలసీ సడలింపులకు దిగుతున్నాయి. మరోవైపు చైనా, ఈసీబీ 2019 సంవత్సరానికి వృద్ధి అంచనాలను తగ్గించాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత స్థానంగా భావించే బంగారంపై ఎక్కువ ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్‌ ఫెడ్‌ సైతం వృద్ధి మందగమనం కారణంగా మరింత రేట్లపెంపునకు దిగకుండా ఓపిక పట్టే ఛాన్సులే కనిపిస్తున్నాయి.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా స్థూల ఆర్థిక అంశాలు ఆందోళనకరంగా మారితే ఆయా దేశాల కేంద్రబ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకునేందుకు యత్నిస్తాయి. ఇప్పటికే చైనా, రష్యా, కజకిస్థాన్‌, ఇండియా, పోలండ్‌, హంగరీ దేశాలు క్రమంగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే యూఎస్‌ ఫెడ్‌ ఈ ఏడాది రేట్లు పెంచేబదులు సంవత్సరాంతానికి రేట్లు తగ్గించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈసీబీ ఇప్పటికే నూతన ఉద్దీపన ప్యాకేజీతో మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఇవన్నీ కలిసి క్రమంగా బంగారం డిమాండ్‌ జోరందుకునే సంకేతాలనే ఇస్తున్నాయి. టెక్నికల్‌గా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1270 డాలర్ల వద్ద మద్దతు పొందుతోంది. ఇక్కడనుంచి క్రమంగా ర్యాలీ జరిపి 1350 డాలర్ల వరకు ఎగబాకే అవకాశముందని నిపుణుల అంచనా. ప్రస్తుతం బంగారం 1280- 1290 డాలర్ల రేంజ్‌లో కదలాడుతోంది. 



You may be interested

వాహన కంపెనీల ఫ్రెండ్లీ షికారు

Saturday 9th March 2019

- బీఎస్‌-6 నిబంధనల అమలుకు కొత్త దోస్తీలు - టాటా హారియర్‌కు.. ఫియట్‌ ఇంజిన్‌ - టాటాతో పాటు ఎంజీకి కూడా ఫియట్‌దే - ఫోర్డ్‌కు మాత్రం మహీంద్రా నుంచి సరఫరా - టెక్నాలజీ విషయంలోనూ కొత్త ఒప్పందాలు - కొత్త రూపంలో దర్శనమివ్వనున్న స్కోడా (సాక్షి, బిజినెస్‌ విభాగం) కానోడికి కానోడు మనోడనేది నానుడి. కానీ ఇపుడు వాహన పరిశ్రమలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కంపెనీలు పోటీ కంపెనీల్ని ప్రత్యర్థులుగా భావించడం మానేస్తున్నాయి. ప్రతి కంపెనీ... తోటి

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి  నష్టాలతో 11,024.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11076.05 పాయింట్లతో పోలిస్తే 52పాయింట్ల నష్టంతో ఉంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలతో ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.  వచ్చే వారంలో దేశీయ సాదరణ ఎన్నికలకు నోటిఫికేషన్‌, మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాల విడుదల మార్కెట్‌పై ప్రభావాన్ని

Most from this category