STOCKS

News


ఇటలీ ఇక్కట్లు.. మార్కెట్లకు తలపోట్లు..

Monday 8th October 2018
news_main1539015885.png-20934

ప్రపంచ మార్కెట్లకు మరోమారు ఇటలీ తలనొప్పులు తెస్తోంది. బడ్జెట్‌ విషయమై ఈయూ అధికారుల ప్రతిపాదనలకు ఇటలీ నో చెప్పడం ఈక్విటీ మార్కెట్లలో ఆందోళనకు కారణమవుతోంది. అసలే చైనా- యూఎస్‌ ట్రేడ్‌ వార్‌, ఇరాన్‌పై ఆంక్షలు తదితర కారణాలతో సతమతమవుతున్న ప్రపంచ మార్కెట్లను ఇటలీ ధిక్కార ధోరణి భయపెడుతోంది. తమ బడ్జెట్‌లో ఈయూ జోక్యాన్ని ఇటలీ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇటలీ ప్రతిపాదించిన బడ్జెట్‌ లక్ష్యాలు విత్తలక్ష్యానికి దూరంగా ఉఉన్నాయని యూరోపియన్‌ కమీషన్‌ వ్యాఖ్యానించింది. కానీ ఇటలీ మార్పులకు అంగీకరించలేదు. మరోవైపు ఈ నెల్లో ఇటలీ క్రెడిట్‌ రేటింగ్‌ను మూడీస్‌, ఎస్‌అండ్‌పీ సమీక్షించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ నాలుగేళ్ల గరిష్ఠాలకు చేరాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో షాంఘై, హ్యాంగ్‌సంగ్‌, సిడ్నీ మార్కెట్లన్నీ నష్టాల్లో క్లోజవగా యూరప్‌, యూఎస్‌ మార్కెట్లు సైతం క్షీణతను కొనసాగిస్తున్నాయి. ఇటలీ మార్కెట్లలో బ్యాంకింగ్‌ షేర్లు భారీ పతనాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు డాలర్‌ మరింతగా బలపడడం కూడా స్టాక్‌ మార్కెట్లను కుంగదీసింది. జర్మనీ పారిశ్రామిక గణాంకాలు పేలవంగా ఉండడం ఇన్వెస్టర్లలో కలవరపాటును మరింత పెంచుతోంది. చైనా మార్కెట్లు వారం సెలవల అనంతరం సోమవారం ఆరంభమయ్యాయి. కానీ చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడ్‌వార్‌ ముదురుతున్న వేళ పరిస్థితులు మరింత విషమించకుండా ఉండేందుకు చైనా కేంద్ర బ్యాంకు పలు చర్యలు చేపడుతోంది. ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలనిస్తాయో వేచిచూడాల్సిఉంది. మరోవైపు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు 23 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది. 
 



You may be interested

మధ్య కాలానికి మూడు స్టాక్స్‌

Monday 8th October 2018

మార్కెట్లలో భారీ కరెక్షన్‌ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాల కోసం ఇన్వెస్టర్లు పరిశీలన చేయడం సర్వసాధారణం. సెన్సెక్స్‌ ఇప్పటికే రూ.4,600 పాయింట్లను నష్టపోయింది. రూ.22.74 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. జనవరి గరిష్టాల నుంచి చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 23.56 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 31.42 శాతం పడిపోయాయి. స్టాక్స్‌ విలువలు చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ మార్కెట్‌ సెంటిమెంట్‌ ఇంకా ప్రతికూలంగానే ఉంది. ఇందుకు చమురు ధరలు, బాండ్‌ ఈల్డ్స్‌

గతేడాది హీరోలు.. ఈ ఏడాది జీరోలు..

Monday 8th October 2018

మార్కెట్లలో ప్రస్తుతం వచ్చిన కరెక‌్షన్‌ను నిపుణులు ఎప్పటినుంచో అంచనా వేస్తున్నారు. గత మూడు నెలలుగా కేవలం ఐదారు స్టాకుల కారణంగా సూచీలు పైపైకి పోయాయి. ఈ పెరుగుదల నిలిచేది కాదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. పడేందుకు వంక కోసం చూస్తున్న మార్కెట్లకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం కలిసివచ్చింది. అటుపై ఎన్‌బీఎఫ్‌సీల గోల, ముడిచమురు మంట, రూపీ పతనం...  ఇలా అనేక కారణాలు చూపుతూ మార్కెట్లు కుప్పకూలాయి. తాజా పాలసీలో రేట్లను

Most from this category