STOCKS

News


ఫోర్బ్స్‌ క్రిప్టో సంపన్నుల జాబితా..

Thursday 8th February 2018
news_main1518113564.png-13806

  • క్రిస్‌ లార్సెన్‌కు అగ్రస్థానం

 న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ తాజాగా తొలి క్రిప్టో కరెన్సీ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిపిల్‌ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ లార్సెన్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన క్రిప్టో నికర విలువ 7.5- 8  బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం.. 2017లో బిట్‌కాయిన్‌, ఇథీరియమ్‌, ఎక్స్‌ఆర్‌పీ అనే మూడు ప్రముఖ క్రిప్టోకరెన్సీల సగటు విలువలో మార్పు 14,409 శాతంగా ఉంది. దాదాపు 1,500 క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటి సమిష్టి విలువ 550 బిలియన్‌ డాలర్లు. 2017 ప్రారంభం నుంచి చూస్తే ఈ కరెన్సీల విలువ 31 శాతం మేర ఎగసింది. జోసెఫ్‌ లుబిన్‌ (క్రిప్టో నికర విలువ: 1-5 బిలియన్‌ డాలర్లు), చాంగ్‌పెంగ్ ఝావో (1-1.2 బిలియన్‌ డాలర్లు), కామెరాన్‌ అండ్‌ టైలెర్‌ వింక్‌లెవోస్‌ (900 మిలియన్‌- 1.1 బిలియన్‌ డాలర్లు), మాథ్యూ మెలాన్‌ (900 మిలియన్‌-1.1 బిలియన్‌ డాలర్లు) తదితరులు ఈ జాబితాలో స్థానం పొందారు. అధిక ఒడిదుడుకుల నేపథ్యంలో నికర విలువ అంచనాలను ఏకమొత్తంగా కాకుండా శ్రేణి రూపంలో వెల్లడించింది. 2018 జనవరి 19 నాటి క్రిప్టో కరెన్సీల విలువ ఆధారంగా ఈ సంపన్నుల జాబితాలను రూపొందించారు. ఇందులో స్థానం దక్కించుకోవాలంటే కనీసం 350 మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండాలి. భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్దత లేదు. 



You may be interested

ద్రవ్యలోటు బాట తప్పడం తగదు: దువ్వూరి

Thursday 8th February 2018

 ఇది ఆందోళనకరమేనని వ్యాఖ్య సింగపూర్‌: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1వ తేదీ తన బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించడం తగిన నిర్ణయం కాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం అసంతృప్తికి గురిచేసిందన్నారు. ‘‘ద్రవ్య స్థిరీకరణ విషయంలో అటు యూపీఏ కానీయండి... లేదా ఎన్‌డీఏ కానీయండి. ఆర్థికమంత్రులు ప్రతిసారీ ‘విరామ’ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇది తప్పదంటూ తమను

స్వల్పంగా తగ్గిన గ్రాన్యూల్స్‌ లాభం

Thursday 8th February 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.39 కోట్ల నుంచి రూ.35 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.364 కోట్ల నుంచి రూ.411 కోట్లకు ఎగసింది. 2017-18 ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో రూ.1,197 కోట్ల టర్నోవరుపై రూ.112 కోట్ల నికరలాభం ఆర్జించింది. వామా ఇండస్ట్రీస్‌ లాభం రూ.1.1 కోట్లు.. డిసెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో వామా ఇండస్ట్రీస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే

Most from this category