STOCKS

News


జూలైలోనే ఫెడ్‌ రేట్ల తగ్గింపు?!

Saturday 8th June 2019
news_main1559988166.png-26180

మేలో యూఎస్‌ ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉండడంతో జూలై సమీక్షలో ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులతో ట్రంప్‌ పేచీలు పడుతున్న సమయాన జాబ్‌ రిపోర్ట్‌ బలహీనంగా రావడంతో ఫెడ్‌ రేట్‌కట్‌కు తొందరపడవచ్చని అంచనా వేస్తున్నారు. మేలో పేరోల్స్‌లో 75వేల పెరుగుదల కనిపించింది. ఇది అంచనాల కన్నా తక్కువగా ఉంది. బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో నిపుణులు పేరోల్స్‌ పెరుగుదల 1,75,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. పేరోల్స్‌లో తరుగుదల ఎకానమీలో మందగమనాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఫెడ్‌ వచ్చే నెల 0.5 పర్సెంటేజ్‌ పాయింట్‌ మేర రేట్లను తగ్గించవచ్చని బార్కెలేస్ ఎకనమిస్టులు అంచనా వేశారు. నిజానికి ఈ తగ్గింపు వచ్చే సెప్టెంబర్‌లో ఉండొచ్చని వీరు గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తగ్గింపు జూలై లోనే ఉండే అవకాశం ఉందని, తిరిగి సెప్టెంబర్లో కూడా ఒక దఫా రేట్‌ కట్‌ ఉండొచ్చని వీరు చెబుతున్నారు.

రేట్‌కట్‌ సెప్టెంబర్‌, డిసెంబర్‌లో ఉంటుందని గతంలో అంచనా వేసిన మాక్రోపాలసీ పెర్‌స్పెక్టివ్స్‌ సంస్థ నిపుణులు సైతం తమ అభిప్రాయం మార్చుకున్నారు. జూలై, సెప్టెంబర్‌లో రేట్‌కట్‌ ఉండొచ్చని వీరు తాజాగా అంచనా వేస్తున్నారు. బోఫాఎంఎల్‌ నిపుణులు మాత్రం రేట్‌కట్‌ సెప్టెంబర్‌, డిసెంబర్‌లోనే ఉంటుందని చెబుతున్నారు. ఫెడ్‌ ఒక నిర్ణయానికి వచ్చేముందు మరిన్ని ఆధారాలను అభిలషిస్తుందని, ఎకానమీ నిజంగా బలహీనపడిందని రానున్న నెలల్లో తేలితే సెప్టెంబర్‌లో రేట్లను తగ్గిస్తుందని చెప్పారు. జూన్‌లో జరిగే జీ20 సదస్సులో యూఎస్‌కు ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య పేచీలపై స్పష్టత రావచ్చని ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాతే ఎకానమీపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. 


 



You may be interested

నిఫ్టీ చార్టుల్లో డోజీ సిగ్నల్‌

Saturday 8th June 2019

అనిశ్చితి కొనసాగుతుందన్న సంకేతం డైలీ చార్టుల్లో నిఫ్టీ డోజీ తరహా క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఈ క్యాండిల్‌ సూచీల్లో అనిశ్చితి కొనసాగుతుందనేందుకు సంకేతంగా చెబుతారు. అయితే క్యాండిల్‌కు ఉన్న పొడవైన తోక, ఇంట్రాడేలో అమ్మకాల వెల్లువను సూచిస్తోంది. వీక్లీచార్టుల్లో సూచీ బేరిష్‌ డార్క్‌ క్లౌడ్‌ కవర్‌ను ఏర్పాటు చేసింది. స్వల్పకాలానికి నిఫ్టీ 11750- 11800 పాయింట్ల మధ్య మద్దతు పొందుతుందని, ఈ జోన్‌ను కాపాడుకోలేకపోతే 11550- 11650 వరకు పతనమవుతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

ఎంటర్‌ప్రెన్యూర్లకు జెఫ్‌బెజోస్‌ సలహాలు

Saturday 8th June 2019

కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుతున్నవారికి ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌ రెండు సలహాలు ఇస్తున్నారు. కస్టమర్‌ను మర్చిపోవద్దని, అపజయాలకు కుంగిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకోవాలని ఆయన చెబుతున్నారు. అమెజాన్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారవేత్తకు కస్టమర్‌ పట్ల ఎక్కువ ధ్యాస ఉండడమే చాలా ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు. కస్లమర్లను సంపూర్ణంగా ఎలా సంతృప్తి పరచాలో తెలుసుకోవాలని సూచించారు. అమెజాన్‌ తన కస్టమర్లను నిలుపుకోవడానికి చాల ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఒక్కోసారి ఉత్పత్తిపై నష్టం

Most from this category