STOCKS

News


ఫెడ్ రేటు పావు శాతం పెంపు..

Thursday 27th September 2018
news_main1538022874.png-20614

వాషింగ్టన్‌: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్‌ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది మరోమారు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడ్ సూచనప్రాయంగా తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 4 శాతం మేర వృద్ధి నమోదు చేయడం, నిరుద్యోగిత చరిత్రాత్మక కనిష్ట స్థాయి 4 శాతం దరిదాపుల్లో ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అంచనాలకు తగ్గట్లు రెండు శాతానికి చేరడం తదితర అంశాలు వడ్డీ రేట్ల పెంపునకు కారణమైనట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, త్వరితగతిన వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం కూడా అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  



You may be interested

కెమాన్‌ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు

Thursday 27th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ టెక్నో మొబైల్‌ తాజాగా కెమాన్‌ సిరీస్‌లో మూడు మోడళ్లను బుధవారం ప్రవేశపెట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ సాంకేతికతో కూడిన కెమెరాలు వీటి ప్రత్యేకత అని టెక్నోను ప్రమోట్‌ చేస్తున్న ట్రాన్సియాన్‌ ఇండియా సీఎంవో గౌరవ్‌ టికూ మీడియాకు తెలిపారు. ఎలాంటి వెలుతురులోనైనా చిత్రాలను తీయగలదని చెప్పారు. లైటింగ్‌ కండీషన్‌, బ్రైట్‌నెస్‌ ఆధారంగా సీన్‌ను అంచనా వేసి ఫోటోకు అందాన్ని తెచ్చేందుకు ఆటో సీన్‌ డిటెక్షన్‌ ఫీచరును

గురువారం ప్రభావితమయ్యే షేర్లు

Thursday 27th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కన్జ్యూమర్‌ గూడ్స్‌ షేర్లు:- పెరిగిపోతున్న కరెంట్‌ ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతను అడ్డుకునే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 19రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. బుధవారం అర్థరాత్రి నుంచి రేట్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో నేడు కన్జ్యూమర్‌ గూడ్స్‌ షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హీరోమోటర్‌ కార్ప్‌:- పెరుగుతున్న ముడివస్తువుల

Most from this category