News


మళ్లీ పావుశాతం వడ్డించిన ఫెడ్‌

Thursday 20th December 2018
news_main1545280941.png-23091

  • బెంచ్‌మార్క్‌ వడ్డీ రేటు  పెంపు
  • 2.25-2.50 శాతానికి చేరిన రేట్ల శ్రేణి

‘వడ్డీ రేట్లు పెంచి మళ్లీ తప్పు చేయవద్దు’ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఫెడరల్‌ రిజర్వుకు పంపిన హెచ్చరిక. అయితే ఫెడరల్‌ రిజర్వు ట్రంప్‌ హెచ్చరికను ఎప్పటిలాగే బేఖాతరు చేసింది. తన విధానాలకు కట్టుబడుతూ కీలక పాలసీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్‌ రేట్ల శ్రేణి 2.25-2.5 శాతానికి చేరింది. దీంతో ఈ ఏడాది ఫెడరల్‌ రిజర్వు నాలుగు సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయ్యింది. 2015 డిసెంబర్‌ నుంచి చూస్తే తొమ్మిది సార్లు రేట్లు పెంచింది. కాగా 2006 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి చూస్తే అంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఫెడరల్‌ రిజర్వు తొలిసారి 2015 డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. దీంతో ఫెడ్‌ రేటు 0-0.25 శాతం శ్రేణి నుంచి 0.25-0.50 శాతం శ్రేణికి చేరింది. కాగా తాజా రేటు పెంపును మార్కెట్‌ వర్గాలు ఈ పెంపును ముందుగానే అంచనా వేశాయి. 
2019లో రేట్ల పెంపు మూడు సార్లు ఉండొచ్చని గతంలో పేర్కొన్న ఫెడ్‌ అధికారులు.. తాజాగా రెండు సార్లు మాత్రమే రేట్ల పెంపు ఉండొచ్చని తెలియజేశారు. సరళ పాలసీ విధానానికి కాకుండా క్రమానుగత రేట్ల పెంపు పాలసీకి కట్టుబడి ఉండటమే సరైనదని ఫెడ్‌ పేర్కొంది. 2018లో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని తెలిపింది. 2019లో ఇది 2.3 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. కాగా గత పాలసీ సమావేశంలో ఫెడ్‌.. అమెరికా వృద్ధి రేటు 2019లో 2.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.    You may be interested

ఏంజెల్ ట్యాక్స్‌పై స్టార్టప్‌లలో ఆందోళన

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపుతుండటం.. స్టార్టప్‌ సంస్థలను కలవరపెడుతోంది. పలు స్టార్టప్‌లు వీటిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్లు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఏంజెల్ ట్యాక్స్‌ నోటీసులపై ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టి.వి. మోహన్‌దాస్ పాయ్

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 20th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఫైజర్‌:- బ్రిటన్‌కు చెందిన గ్లాస్కోస్మిత్‌లైన్‌ పీఎల్‌సీతో అమెరికాలోని తన మాతృసంస్థ ఫైజర్‌ ఇంక్‌ వ్యూహాత్మక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఇరు సంస్థల భాగస్వామ్యంలో  ప్రపంచస్థాయి కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. టీసీఎస్‌:- కెనడాలో నెక్ట్స్‌ జనరేషన్‌ క్లౌడ్‌ను ప్రారంభించింది. కెనరా బ్యాంక్‌:- బాసిల్‌-III బాం‍డ్ల జారీ ద్వారా రూ.3000 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను ఒకేసారి లేదా వివిధ దఫాలుగా సమీకరించవచ్చని కంపెనీ

Most from this category