ఫేస్బుక్ మరింత బైబ్యాక్!
By Sakshi

షేర్ల పతనంతో తీవ్ర ఆందోళనలకు గురవుతున్న ఇన్వెస్టర్లకు ఊరట కలిగించేందుకు ఫేస్బుక్ కంపెనీ 9మిలియన్ డాలర్ల విలువైన అదనపు బైబ్యాక్ ఇష్యూను ప్రకటించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా కారణంగా జరిగిన సమాచార దుర్వినియోగం కుంభకోణంతో పాటు యూరోపిన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ ‘‘బ్రెగ్జిట్’’కు నిర్వహించిన ఓటింగ్‌లో ఓటర్లను ప్రభావితం చేసిందనే ఆరోపణ ఫేస్‌బుక్‌పై వచ్చాయి. రానున్న రోజుల్లో బలహీనమైన ఆదాయం ఉంటుందనే అంచనాలతో పాటు, వాల్స్ట్రీల్లో టెక్నాలజీ షేర్ల ర్యాలీ మందిగించడంతో ఈ ఏడాదిలో ఫేస్బుక్ షేర్లు ఏకంగా 22శాతం నష్టపోయాయి. ఈ తరుణంలో నష్టాల బాట పట్టిన షేర్లను లాభాల గాడిలోకి తెచ్చేందుకు, ఇన్వెస్టర్లలో షేర్ల పట్ల వ్యతిరేకతా భావం కలగకుండా గతేడాది ప్రకటించిన బైబ్యాక్ ఇష్యూకు అదనంగా మరో 9మిలియన్ డాలర్ల బైబ్యాక్ ఇష్యూను కంపెనీ అమెరికా రెగ్యూలేటరీ ఎక్చే్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. గతేడాది చివర్లో కంపెనీ 15బిలియన్ డాలర్ల బైబ్యాక్ ఇష్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫేస్బుక్ కంపెనీ అదనపు బైబ్యాక్ ఇష్యూ ప్రకటించడంతో ఫ్యూచర్స్ ట్రేడ్‌లో కంపెనీ షేర్లు 1.40శాతం లాభపడి 138.00 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.
You may be interested
ఎగ్జిట్ పోల్స్ ఏం చేస్తాయో!
Saturday 8th December 2018సోమవారం మార్కెట్లో కరెక్షన్ తప్పదా? ఫలితాలు పాజిటివ్‌గా ఉంటే ర్యాలీకి అవకాశం క్రూడాయిల్ ధర పెరిగిందా? తగ్గిందా? డాలర్‌తో రూపాయి విలువ బలపడిందా? పతనమైందా? క్యాడ్ ఎంత ఉంది? ట్రేడ్‌వార్ ముగిసినట్లేనా?.. ఇవన్నీ మార్కెట్లు ప్రతిరోజూ పట్టించుకునే అంశాలు. వీటి ఆధారంగానే మార్కెట్ కదలికలుంటుంటాయి. కానీ ఇవన్నీ ప్రస్తుతం అప్రస్తుతంగా మారాయి. ఈ వారానికి ఒకే ఒక్క విషయం మార్కెట్ కదలికలను శాసించబోతోంది. అదే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితం. సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావించే ఈ ఎన్నికల
ఇండియన్ ఏడీఆర్‌లు డౌన్..
Saturday 8th December 2018వేదాంత ఏడీఆర్ 2 శాతానికి పైగా పతనం అమెరికా స్టాక్ మార్కెట్లోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్ శుక్రవారం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్లన్నీ తగ్గాయి. వేదాంత ఏడీఆర్ గరిష్టంగా 2 శాతానికి పైగా పడిపోతే.. మిగతా వాటి ఏడీఆర్‌లు 1 శాతానికి పైగా క్షీణించాయి. టాటా మోటార్స్ ఏడీఆర్ 1.75