STOCKS

News


డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

Thursday 21st March 2019
news_main1553162144.png-24731

డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు
లాస్‌ఏంజెల్స్‌: ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఫాక్స్‌ కంపెనీ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. ఈ డీల్‌లో భాగంగా ఫాక్స్‌ సంస్థకు చెందిన ఫిల్మ్‌, టీవీ స్టూడియో, ఎఫ్‌ఎక్స్‌, నేషనల్‌ జాగ్రఫిక్‌, హులు స్ట్రీమింగ్‌ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటా, స్టార్‌ ఇండియాలపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. ఈ కంపెనీ చేజిక్కిన ఫలితంగా డీస్నీ సంస్థ, డిస్నీ ప్లస్‌ పేరుతో అందించనున్న  స్ట్రీమింగ్‌ సర్వీస్‌  ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.  అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి టెక్నాలజీ కంపెనీలకు గట్టిపోటీనివ్వడానికి ఈ డీల్‌ డిస్నీకి దోహదం చేయనున్నదని అంచనా. 

ఇది అసాధారణమైన, చారిత్రాత్మక డీల్‌
ఇది ఒక అసాధారణమైన, చారిత్రాత్మక ఘటన అని వాల్ట్‌ డిస్నీ కంపెనీ చైర్మన్‌, సీఈఓ రాబర్ట​ ఐగర్‌ వ్యాఖ్యానించారు. తమ కంపెనీకి, వాటాదారులకు దీర్ఘకాలిక విలువ చేకూర్చే డీల్‌ ఇదని పేర్కొన్నారు. కాగా డిస్నీ, ఫాక్స్‌ రెండు కంపెనీలు సినిమాలు తీసే రంగంలోనే ఉండటంతో ఇరు సంస్థల్లో దాదాపు 4,000 మంది  తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ డీల్‌ కారణంగా ఇక హాలీవుడ్‌లో ఐదు పెద్ద స్డూడియోలు మిగులుతాయి. వార్నర్‌ బ్రదర్స్‌, యూనివర్శల్‌, సోనీ పిక్చర్స్‌, పారమౌంట్‌ పిక్చర్స్‌, డిస్నీ స్టూడియోలే హాలీవుడ్‌లో మిగులుతాయి.



You may be interested

దేశీ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ‘స్విచ్‌ ఆఫ్‌’

Thursday 21st March 2019

మార్కెట్‌ అంతా విదేశీ కంపెనీలదే ప్రీమియం బ్రాండ్లూ కనుమరుగు అనూహ్యంగా మారిన స్మార్ట్‌ఫోన్‌ విపణి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మీకు గుర్తుందా.. దేశీయ మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్లు రూ.5 వేలలోపే స్మార్ట్‌ఫోన్లను అందించి భారత్‌లో సంచలనం సృష్టించాయి. ధరల పరంగా, ఫీచర్లతో దిగ్గజ బ్రాండ్లకు వణుకు పుట్టించాయి. ఒకానొక దశలో మొత్తం మార్కెట్లో దేశీయ బ్రాండ్లదే సింహభాగం. ఇదంతా గతం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. దేశీయ బ్రాండ్లు కనుమరుగయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

Thursday 21st March 2019

-బుధవారం ముగింపు ధర కంటే 62 శాతం తక్కువ  -రైట్స్‌ ఇష్యూ రికార్డ్‌ డేట్‌ ఏప్రిల్‌ 2 -ఏప్రిల్‌ 10-24 మధ్య రైట్స్‌ ఇష్యూ  -ప్రతి 38 షేర్లకు 87 రైట్స్‌ షేర్లు  న్యూఢిల్లీ:- వొడాఫోన్‌ ఐడియా కంపెనీ రైట్స్‌ ఇష్యూ ధరను నిర్ణయించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదిత రైట్స్‌ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేర్‌ (రూ.10 ముఖ విలువ) ధరను

Most from this category