STOCKS

News


క్రూడ్‌ మరింత ప్రియం?!

Friday 19th April 2019
news_main1555670864.png-25232

ఆనంద్‌ రాఠీ అంచనా
ఒపెక్‌ ఉత్పత్తికోతల ప్రభావం ముడిచమురు ధరపై బాగానే కనిపిస్తోంది. ఫిబ్రవరితో పోలిస్తే ఒపెక్‌ రోజువారీ చమురు ఉత్పత్తిలో దాదాపు 5లక్షల బ్యారెళ్ల క్షీణత నమోదయింది. సౌదీ అరేబియా, వెనెజులా, ఇరాక్‌లో ఉత్పత్తి భారీగా పతనం కావడం చమురు ధరపై పడింది. తిరిగి ముడిచమురు ధరలో సమతుల్యం వచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటామని సౌదీ ప్రకటిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిలో మరింత కోతలు విధించేందుకు కూడా రెడీ అంటోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో చమురు ధరలు సమీప భవిష్యత్‌లో స్థిరంగా బలపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోపక్క యూఎస్‌ ఆంక్షల ప్రభావంతో వెనెజులాలో చమురు ఉత్పత్తి భారీగా పతనమైంది. త్వరలో యూఎస్‌ ఈదేశంపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు తయారవుతోంది. వెనెజులా, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ప్రధాన దిగుమతిదారులైన ఇండియా, చైనాలపై యూఎస్‌ ఒత్తిడి తెస్తోంది. దీంతో వెనెజులా పరిస్థితి మరింత ఇబ్బందుల్లోకి జారనుంది. ఇటు పక్క ఇరాన్‌ ఉత్పత్తి కూడా ఆంక్షల కారణంగా భారీగా తగ్గింది. మే2 తర్వాత ఇరాన్‌ ఉత్పత్తిలో మరింత పతనం ఖాయంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. లిబియాలో మిలిటెంట్‌ చర్యలు కూడా చమురు మార్కెట్‌లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఇవన్నీ కలిసి బ్రెంట్‌ క్రూడ్‌ ధరను మరింత పైకి తీసుకుపోయే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరానికి బ్రెంట్‌ క్రూడ్‌ అంచనా ధరను ఈఐఏ ఇప్పటికే 63 నుంచి 69 డాలర్లకు పెంచింది. ఈ నేపథ్యంలో చమురు ఫ్యూచర్స్‌పై బుల్లిష్‌ ధృక్పధంతో అనలిస్టులున్నారు.



You may be interested

ఆర్‌ఐఎల్‌ షేరుపై అనలిస్టుల అంచనాలివి..

Friday 19th April 2019

మార్చి క్వార్టర్‌లో రికార్డు లాభాలను ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేరు సోమవారం(ఏప్రిల్‌ 22న) ట్రేడింగ్‌ను పాజిటివ్‌గా ప్రారంభించవచ్చని షేర్‌ఖాన్‌ బ్రోకరింగ్‌ సంస్థ సీనియర్‌ విశ్లేషకుడు అభిజిత్‌ బోరా అభిప్రాయపడుతున్నారు. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌) 8.2 డాలర్లు నమోదైంది. ఇది సింగపూర్‌ జీఆర్‌ఎమ్‌ కంటే అధికంగా ఉందని ఆయన్నారు. కన్జ్యూమర్‌ వ్యాపారాలైన రీటైల్‌, జియో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆయా రంగాల మార్జిన్లు పెరిగాయి. ఇక ముందస్తు అంచనాలకు అనుగుణంగానే చమురు శుద్ధి,

పీఎస్‌యూలపై పెరిగిన ఆసక్తి

Friday 19th April 2019

మార్నింగ్‌స్టార్‌ ప్రతినిధి కౌస్తుభ్‌ బెలాపుర్కర్‌ గతనెల ఈక్విటీల్లో రిటైలర్ల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని, ఫండ్‌ మేనేజర్లు ఎక్కువగా పీఎస్‌యూలు, కన్జూమర్‌ స్టాకులపై మక్కువ చూపారని మార్నింగ్‌స్టార్‌ ఫండ్‌ రిసెర్చ్‌ హెడ్‌ కౌస్తుభ్‌ బెలాపుర్కర్‌ చెప్పారు. రెండు నెలలుగా ఎఫ్‌ఐఐల హవా పెరిగిందని, ఈ సమయంలో డీఐఐలు కాస్త నెమ్మదించాయని చెప్పారు. మార్చిలో ఫండ్‌మేనేజర్లు ఎక్కువగా ఈటీఎఫ్‌ల రూపంలో పీఎస్‌యూల్లో పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కోల్‌ఇండియా, ఐఓసీ వంటి ప్రభుత్వ

Most from this category