News


మరిన్ని ఉత్పత్తులపై సుంకాల మినహాయింపునివ్వండి

Tuesday 5th March 2019
news_main1551764296.png-24435

  • భారత్‌ను కోరిన చైనా

న్యూఢిల్లీ: తమ దేశం నుంచి దిగుమతయ్యే మరిన్ని ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలని భారత్‌ను చైనా కోరింది. చైనా నుంచి దిగుమతయ్యే 74 శాతం ఉత్పత్తులకు దశలవారీగా సుంకాల మినహాయింపునిచ్చేలా భారత్ ఆఫర్ చేయగా .. ఈ పరిమితిని 85 శాతానికి పెంచాలని చైనా కోరింది. దీనికి ప్రతిగా భారత్ నుంచి వచ్చే 92 శాతం దిగుమతులపై తాము సుంకాలపరమైన మినహాయింపులిస్తామని పేర్కొంది. సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా ఇరుదేశాల మధ్య సమావేశాల సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇతర దేశాల నుంచి వచ్చే 90 శాతం పైగా దిగుమతులపై భారత్‌ సుంకాలపరమైన మినహాయింపులు ఇస్తోంది. కానీ కొన్ని రిస్కుల కారణంగా చైనాకు మాత్రం కొంత తక్కువ మినహాయింపులు ఉంటున్నాయి. ఒకవేళ ప్రస్తుత ప్రతిపాదనలనే అమలు చేసినా.. చైనా ఉత్పత్తులు భారత్‌ను ముంచెత్తుతాయనే భయాలు నెలకొన్నాయి. ఆర్‌సీఈపీపై గత ఆరేళ్లుగా కసరత్తు జరుగుతోంది. చౌక ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తేస్తే.. పలు పరిశ్రమలు మూతబడే ప్రమాదముందనే ఉద్దేశంతో భారత్‌ తదితర కొన్ని దేశాలు జరుపుతున్న చర్చల కారణంగా డీల్‌పై జాప్యం జరుగుతోంది. ఒప్పందం కుదుర్చుకునేందుకు 2019 డెడ్‌లైన్.



You may be interested

రూ. 12 వేల కోట్లకు ఆన్‌లైన్ గేమింగ్‌

Tuesday 5th March 2019

రూ. 12 వేల కోట్లకు ఆన్‌లైన్ గేమింగ్‌ - 2023 ఆర్థిక సంవత్సరం నాటికి అంచనా - 2018-2023 మధ్య 22 శాతం వార్షిక వృద్ధి - కేపీఎ౾ంజీ- గేమింగ్ ఫెడరేషన్‌ నివేదికలో వెల్లడి ముంబై: డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.11,900 కోట్లకు చేరనున్నట్లు కేపీఎంజీ- ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ రూపొందించిన నివేదిక

విదేశీ వాణిజ్య రుణాలు 45% డౌన్‌

Tuesday 5th March 2019

జనవరిలో 2.42 బిలియన్‌ డాలర్లకు పరిమితం ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జనవరిలో విదేశీ మార్కెట్ల నుంచి సేకరించిన మొత్తం రుణాలు (ఈసీబీ) 2.42 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదేకాలంలో దేశీ సంస్థలు పొందిన విదేశీ వాణిజ్య రుణాలు 5.40 బిలియన్‌ డాలర్లు కాగా.. ఈ మొత్తంతో పోల్చితే ఈసారి 45 శాతం తగ్గుదల నమోదైంది. ఇక ఈఏడాది జనవరిలో 2.27

Most from this category