STOCKS

News


20 యేళ్ల తర్వాత ‘క్యాడ్‌’ గుప్పిట్లోకి చైనా!

Wednesday 8th August 2018
news_main1533703815.png-19030

బీజింగ్‌: ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- సీఏడీ) సమస్యలోకి జారింది. 2018 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్‌) 28.3 బిలియన్‌ డాలర్ల క్యాడ్‌ను నమోదు చేసింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం,  చైనా నుంచి దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు ఈ పరిణామానికి నేపథ్యం. ఆరు నెలల కాలాన్ని చూస్తే 20 సంవత్సరాల తర్వాత క్యాడ్‌ నమోదయితే, త్రైమాసికం పరంగా పదిహేడేళ్లలో ఈ సమస్యను ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీనితో ఏళ్ల తరబడి భారీ ఎగుమతులతో వాణిజ్య మిగులు దేశంగా ఉన్న చైనా, ఆ ప్రతిష్టను కోల్పోయినట్లయ్యింది. 

2008 నుంచే దిగువమెట్టు...
నిజానికి 2008 ఆర్థిక సంక్షోభం నుంచీ చైనా వాణిజ్య మిగులు పరిస్థితి దిగజారుతూ వస్తోంది. 2007 చైనా స్థూల దేశీయోత్పత్తిలో ఆ దేశ వాణిజ్య మిగులు 9.9 శాతం అయితే 2017లో ఇది 1.3 శాతానికి పడిపోయింది. విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ)లు మినహా దేశంలోకి ఒక నిర్దిష్ట ఏడాదిలో వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసమే కరెంట్‌ అకౌంట్‌ లోటు. ఈ లోటు ఎంతఉంటే అంతమేర ఆ దేశం విదేశాలకు రుణగ్రస్థమై ఉంటుంది. ఎగుమతులను పెంచుకోవడమే ఈ సమస్యకు ప్రధాన పరిష్కారం అవుతుంది. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 8th August 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- రేయాల్ట్రిస్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు లభించినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. టాటా టెలీసర్వీసెస్‌:- రూ.20వేల కోట్ల నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఆగస్ట్‌ 10న బోర్డు సమావేశం నిర్వహించనుంది. పాటిల్‌ ఇంజనీరింగ్స్‌:- రూ.1793.5కోట్ల విలువైన రెండు హైడ్రో ప్రాజెక్ట్స్‌లతో పాటు రూ.618.21 కోట్ల టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి మొత్తం రూ.2411.26 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. జీఓసీఎల్‌:-

37 శాతం తగ్గిన సంఘి ఇండస్ట్రీస్‌ లాభం

Wednesday 8th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:  జూన్‌ త్రైమాసికంలో సంఘి ఇండస్ట్రీస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 37 శాతం తగ్గి రూ.20 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.315 కోట్ల నుంచి రూ.283 కోట్లకు వచ్చి చేరింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 4.81 శాతం తగ్గి రూ.88.05 వద్ద స్థిరపడింది.

Most from this category