STOCKS

News


ఆలీబాబా సింగిల్స్ డే రికార్డు..

Monday 12th November 2018
news_main1542000087.png-21889

షాంఘై: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆదివారం నిర్వహించిన సింగిల్స్‌ డే సేల్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. గతేడాది సింగిల్స్‌ డే రోజు నమోదైన 25 బిలియన్ డాలర్ల విక్రయాలను కేవలం 16 గంటల్లోనే సాధించి తన రికార‍్డు తానే తిరగరాసుకుంది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు పాలపౌడరు, డైపర్లు మొదలైనవి కూడా అత్యధికంగా అమ్ముడైన వాటిల్లో ఉన్నాయి. జంటల కోసం ఉద్దేశించినదైన వేలంటైన్స్‌ డేకి భిన్నంగా పదకొండో నెల పదకొండో తారీఖుని సింగిల్స్‌ (ఒంటరి) డేగా చైనా యువత పాటిస్తుంది. దీన్ని పురస్కరించుకుని వ్యాపార సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈసారి సింగిల్స్‌ డే తొలి గంటలోనే ‍ఆలీబాబా సుమారు 10 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అయితే, అమ్మకాలు భారీగానే ఉన్నప్పటికీ.. ఏడాది పొడవునా ఏదో ఒక ఆఫరు అందుబాటులో ఉంటున్నందున కస్టమర్లు క్రమంగా సింగిల్స్ డే కోసమే ఎదురుచూడటం తగ్గుతోందని, ఫలితంగా అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. 



You may be interested

34,811-35,287 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు

Monday 12th November 2018

వరుసగా రెండు నెలలపాటు భారీ విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో...ఒక్కరోజు మినహా నికర కొనుగోళ్లు జరపడం సానుకూలాంశం. రూపాయి కోలుకోవడం, క్రూడ్‌ ధర భారీగా పతనంకావడం ఇందుకు కారణం కావొచ్చు. అయితే అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాల కారణంగా గత శుక్రవారం ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే మరో

విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలకు గడ్డుకాలం

Monday 12th November 2018

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాల పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగం ఆటోమొబైల్‌ సంస్థలకు సంతోషాన్నివ్వలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో బలమైన స్థానం కోసం పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మొత్తం 17 ఆటోమొబైల్‌ సంస్థల్లో సగానికి పైగా కంపెనీల ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు ఏప్రిల్‌-అక్టోబర్‌ కాలంలో తగ్గిపోవడం గమనార్హం. సియామ్‌ గనాంకాల ప్రకారం... అంతర్జాతీయ బ్రాండ్లు అయిన వోక్స్‌వ్యాగన్‌, రెనో, నిస్సాన్‌,

Most from this category