STOCKS

News


ఆండ్రాయిడ్‌ ఫోన్లు జాగ్రత్త!!

Thursday 11th July 2019
news_main1562825681.png-26981

  • 2.5 కోట్ల ఫోన్లకు ఏజెంట్‌ స్మిత్‌ మాల్‌వేర్‌
  • వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే
  • వెల్లడించిన చెక్‌పాయింట్‌ రీసెర్చ్‌

న్యూఢిల్లీ: ఏజెంట్‌ స్మిత్‌ అనే పేరున్న మొబైల్‌ మాల్‌వేర్‌ (హానికార వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడినట్టు చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థ తన పరిశోధనలో గుర్తించింది. వీటిల్లో 1.5 కోట్ల ఫోన్లు భారత్‌లోనే ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. యూజర్లకు తెలియకుండానే... వారి ఫోన్లలో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల స్థానంలో, వాటినే పోలిన హానికారక వెర్షన్లను ప్రవేశపెడుతున్నట్టు ఈ సం‍స్థ తెలిపింది. ఈ మాల్‌వేర్‌ ముఖ్యంగా హిందీ, అరబిక్‌, రష్యన్‌, ఇండోనేషియా భాషలు మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ఈ విషయమై గూగుల్‌ను సంప్రతించామని, హానికారక యాప్స్‌ ఏవీ ప్లే స్టోర్‌లో మిగిలి లేవని చెక్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. ‘‘ఇప్పటి వరకు ఈ మాల్‌వేర్‌ బారిన పడిన వారు ప్రధానంగా భారత్‌తో పాటు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో ఉన్నారు. అలాగే, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోని ఫోన్లలో దీన్ని గుర్తించడం జరిగింది’’ అని చెక్‌పాయింట్‌ తెలిపింది. మోసపూరిత ప్రకటనలను చూపించి, ఆర్థిక ప్రయోజనం పొందేందుకు ఇది ప్రయత్నిస్తోందని, బ్యాంకింగ్‌ వివరాలను కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. విశ్వసనీయమైన యాప్‌ స్టోర్ల నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి కానీ, థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఆశ్రయించొద్దని సూచించింది. 



You may be interested

తగ్గిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు

Thursday 11th July 2019

జూన్‌లో 17.54 శాతం క్షీణత న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం పీవీ అమ్మకాలు 17.54 శాతం తగ్గి 2,25,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది జూన్‌ విక్రయాలు 2,73,748 యూనిట్లు కాగా, ఈసారి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దేశీ కార్ల విక్రయాలు 24.97 శాతం క్షీణించి 1,39,628 యూనిట్లుగా వెల్లడైంది. 2018 ఏడాదిలో ఇవి 1,83,885 యూనిట్లుగా

భారత్‌, రష్యా మధ్య బలమైన ఆర్థిక సహకారం

Thursday 11th July 2019

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ న్యూఢిల్లీ: భారత్‌, రష్యా తమ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కలసి పనిచేస్తున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్‌ విభాగాల్లో సహకారానికి అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన భారత్‌-రష్యా రెండో వ్యూహాత్మక ఆర్థిక చర్చల కార్యక్రమాన్ని (ఐఆర్‌ఎస్‌ఈడీ) ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రష్యాతో తన

Most from this category