STOCKS

News


పనీపాటా లేని కుర్రకారు ఇక్కడే ఎక్కువ

Thursday 7th March 2019
news_main1551938708.png-24467

- భారత్‌పై ఐఎమ్‌ఎఫ్‌ సీనియర్‌ ఆర్థిక వేత్త వ్యాఖ్య
న్యూఢిల్లీ: యువత ఎలాంటి పనీ లేకుండా ఖాళీగా ఉండటం భారత్‌లోనే అధికమని ఐఎమ్‌ఎఫ్‌ సీనియర్‌ ఆర్థిక వేత్త జాన్‌ బ్లూడోర్న్‌ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధిక యువ జనం పనీపాటా లేకుండా ఉంటారని, ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే వారి సంఖ్య ఇక్కడ 30 శాతంగా ఉందని వివరించారు. బ్రూకింగ్స్‌ ఇండియా నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని లేబర్‌ మార్కెట్లలో లింగ అసమానత్వం, టెక్నాలజీల మార్పు, ఉద్యోగ నాణ్యత అధ్వానంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారాయన. టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్‌ సమస్యల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలపైనే అధికమన్నారు. కాగా భారత్‌లో గత నెలలో నిరుద్యోగం 7.2 శాతానికి పెరిగిందని ముంబైకి చెందిన సీఎమ్‌ఐఈ ఇటీవలే వెల్లడించింది. 2017లో భారత్‌లో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయి, 6.1 శాతానికి చేరిందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ముసాయిదా నివేదిక పేర్కొంది.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎలాంటి డొల్ల కంపెనీలను సృష్టించలేదు

Thursday 7th March 2019

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంట్‌ సంస్థ  ముంబై: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ నిధుల మళ్లింపు కోసం ఎలాంటి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయలేదని స్వతంత్ర చార్టర్డ్‌అకౌంట్‌ సంస్థ దర్యాప్తులో తేలింది. అయితే రుణాలు మంజూరు చేయడంలో మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరించలేకపోయిందంటూ ఈ సంస్థ తేల్చిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది.  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు డొల్ల కంపెనీల ద్వారా రూ.31,000 కోట్ల మేర నిధులను మళ్లించారంటూ ఈ

ఏసీ మార్కెట్‌ వృద్ధి 10 శాతమే!

Thursday 7th March 2019

- వచ్చే రెండేళ్లూ ఇదే స్థాయిలో ఉండే అవకాశం - ఈ ఏడాది 60 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం - జీఎస్‌టీ తగ్గిస్తే మాత్రం మార్కెట్‌కు మరింత జోష్‌ - తయారీ కంపెనీల అంచనాలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: గడిచిన కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఏసీల డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతుండగా... దేశంలో మాత్రం వీటిపై 28 శాతం జీఎస్‌టీ విధిస్తుండటం అమ్మకాల జోరుకు కొంత అడ్డుకట్ట వేస్తున్నట్లుగానే భావించాలి. ఎందుకంటే

Most from this category