STOCKS

News


శాంతించిన టోకు ధరలు

Friday 14th December 2018
news_main1544773660.png-22934

  • నవంబర్‌లో 4.64 శాతానికి తగ్గుదల

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. 4.64 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.62 శాతంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..  చక్కెర, పొగాకు, రసాయన ఉత్పత్తులు, సిమెంట్‌, టెక్స్‌టైల్స్‌ వంటి మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడక్టులు ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21 శాతానికి దిగి వచ్చింది. అక్టోబర్‌లో ఇది 4.49 శాతంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడక్టులకు డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 64.2 శాతం వెయిటేజీ ఉంది. డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 13.2 శాతం వెయిటేజీ ఉన్న ఇంధనం, విద్యుత్‌ విభాగానికి వస్తే ద్రవ్యోల్బణం 18.44 శాతం నుంచి 16.28 శాతానికి తగ్గింది. ఇక ఆహార ఉత్పత్తుల విభాగంలో (డబ్ల్యూపీఐ ఇండెక్స్‌లో 15.3 శాతం వెయిటేజీ) ధరలు సాధారణ స్థాయి కన్నా దిగువున ఉన్నాయి. దీంతో ఇందులో ప్రతిద్రవ్యోల్బణం 3.31 శాతంగా నమోదయ్యింది.  
కాగా అక్టోబర్‌లో డబ్యూపీఐ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.28 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌ నెలలో డబ్ల్యూపీఐ 5.13 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.68 శాతంగా నమోదయ్యింది. 

రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 17 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చిన విషయం తెలిసిందే. 2.33 శాతంగా నమోదయ్యింది. 

 



You may be interested

జపాన్‌ కంపెనీలతో జేవీ.... ఇన్ఫోసిస్‌ ర్యాలీ

Friday 14th December 2018

2శాతం లాభపడిన షేర్లు జపాన్‌ సాంకేతిక మార్కెట్లో అడుగుపెట్టేందుకు దేశీయ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా జపాన్‌కు చెందిన హిటాచీ, పానాసోనిక్‌, పానా సంస్థలతో ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ భాగస్వామ్య కంపెనీ మొత్తం వాటాలో ఒక్క ఇన్ఫోసిస్‌ వాటానే 81శాతం వాటా ఉంటుంది. ఈ మెజార్టీ వాటా కొనుగోలు ఇన్ఫోసిస్‌ 174.58 కోట్లను వ్యయాన్ని

బ్రోకరేజ్‌ పాంచ్‌ పటాకా

Friday 14th December 2018

లాంగ్‌టర్మ్‌ పెట్టుబడి కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు ఐదు స్టాకులను రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: మోర్గాన్‌ స్టాన్లీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 1311. ఏవియేషన్‌ రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా మారాయి. రిస్కురివార్డు నిష్పత్తి పెట్టుబడికి అనుకూలంగా ఉంది. 2. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌: మాక్క్వైరీ సిఫార్సు. టార్గెట్‌ రూ. 290. రాబోయే రోజుల్లో ఈ రంగంలో రికవరీ వస్తుందని అంచనా. వచ్చే మూడేళ్లలో షేరు ధర రెట్టింపు కావచ్చని

Most from this category