STOCKS

News


రూపాయి 74 దాటదు!

Thursday 4th October 2018
news_main1538650078.png-20862

టీసీఎస్‌ అంచనా
వర్ధమాన కరెన్సీల్లో అధ్వాన్న ప్రదర్శన చూపుతున్న భారత రూపాయి కుదురుకుంటుందని టీసీఎస్‌ అంచనా వేస్తోంది. డాలర్‌తో  రూపాయి మారకం విలువ 74 దిగువకు రాదని అభిప్రాయపడింది. రూపీ బాటమ్‌ అవుట్‌ అయ్యేందుకు రెడీగా ఉందని టీసీఎస్‌ ట్రెజరీ హెడ్‌ వెంకటేశన్‌ చెప్పారు. ఒక్క నెల్లో రూపాయి దాదాపు 3 శాతం మేర క్షీణించింది. ఇతర వర్ధమాన కరెన్సీలన్నింటిలో రూపాయి మాత్రమే ఎక్కువగా పతనమైంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి కొత్త కనిష్ఠాలను చూసింది. ఒక దశలో దాదాపు 74 స్థాయిలకు దగ్గరగా వచ్చింది. రూపీ పతనం అడ్డుకునేందుకు దిగుమతులపై ఆంక్షలు, వ్యయ నియంత్రణా చర్యలు, విదేశీ రుణ సేకరణ నిబంధనల సడలింపు, పెట్రో ఉత్పత్తులపై డ్యూటీ తగ్గింపు లాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. 
వర్దమాన కరెన్సీల నెలవారీ ప్రదర్శన

చర్యలు ఫలితాలిస్తాయి
రూపీ పతనం అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయని వెంకటేశన్‌ చెప్పారు. ఈ చర్యలు తగు ఫలితాలిస్తాయన్నారు. రూపీ ఎట్టిపరిస్థితుల్లో 74 కిందకు రాదన్నారు. ఈ ఏడాది ఆర్‌బీఐ, ఎంపీసీ కనీసం మరో రెండు మార్లు వడ్డీరేట్లను పెంచవచ్చని అంచనా వేశారు. ఫెడ్‌ మరోమారు రేట్ల పెంపునకు దిగితే ఆర్‌బీఐకి రేట్లు పెంచడం తప్ప మరోదారి లేదన్నారు. కరెన్సీలో హెడ్జింగ్‌ పొజిషన్లున్నాయని చెప్పారు. ప్రస్తుతం దేశీయ బాండ్‌ మార్కెట్లో టీసీఎస్‌ అతిపెద్ద పెట్టుబడిదారు. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల్లో దాదాపు సగభాగం ప్రభుత్వ సెక్యూరిటీలపై పెట్టుబడిగా పెట్టింది. 



You may be interested

చెక్కు చెదరని టాటా గ్రూపు మార్కెట్‌ క్యాప్‌!

Thursday 4th October 2018

టాటా గ్రూపుకు సంబంధించి తాజా మార్కెట్‌ క్రాష్‌లో ఒక ఆశ్చర్యకర పరిణామం ఉంది. అదేమిటంటే గ్రూపు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (గ్రూపు మార్కెట్‌ విలువ) పెద్దగా పతనం కాకుండా స్థిరంగా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆగస్ట్‌ 29న నమోదు చేసిన రికార్డు గరిష్ట స్థాయి రూ.38,989 నుంచి పది శాతం పడిపోయింది. కానీ, ఇదే కాలంలో టాటా గ్రూపు స్టాక్స్‌ను ట్రాక్‌ చేసే నిఫ్టీ టాటా గ్రూపు ఇండెక్స్‌ ఆగస్ట్‌ 29న

ఆయిల్‌ షేర్లు కుదేలు..

Thursday 4th October 2018

ఆయిల్‌ రంగ షేర్లు ట్రేడింగ్‌ చివరి అర గంటలో భారీగా పతనమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయిల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 86 డాలర్లకు చేరిన నేపథ్యంలో ప్రజలపై ఆ భారం పడకుండా ఉండేందుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 తగ్గిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే

Most from this category