STOCKS

News


సేవల్లో సంస్కరణలతో వృద్ధికి ఊతం

Monday 1st October 2018
news_main1538372364.png-20741

వాషింగ్టన్‌: దీర్ఘకాలికంగా ఎకానమీ వృద్ధి మెరుగుపడేందుకు సేవల రంగంలో సంస్కరణలు తోడ్పడతాయనడానికి భారత్‌ నిదర్శనమని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నాయి. 1990లలో భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మరింత స్వేచ్ఛా వాణిజ్యానికి, మెరుగైన నియంత్రణ విధానాలు, భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడ్డాయని నివేదిక వివరించింది. దేశ, విదేశీ సంస్థల నుంచి భారత తయారీ సంస్థలు సర్వీసులు పొందేందుకు, పోటీ సంస్థలకు దీటుగా ఎదిగేందుకు ఇవి తోడ్పడ్డాయని పేర్కొంది. దేశీ సంస్థలు కొంగొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, టెక్నాలజీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు వైవిధ్యభరితమైన వ్యాపార సేవలు అందుబాటులో ఉండటం లాభించిందని నివేదిక తెలిపింది. బ్యాంకింగ్‌, బీమా, టెలికమ్యూనికేషన్స్‌, రవాణా వంటి రంగాల్లో పోటీతత్వాన్ని పెంచేలా ప్రవేశపెట్టిన సంస్కరణలు .. తయారీ సంస్థల ఉత్పాదకత పెరిగేందుకు ఉపయోగపడ్డాయని వివరించింది. 



You may be interested

36,060-35,985 మద్దతు శ్రేణి కీలకం

Monday 1st October 2018

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ మార్కెట్లన్నింటినీ తలదన్ని పెరిగిన భారత్‌ మార్కెట్‌...ప్రస్తుతం ఇతర మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తుంటే. మన సూచీలు పడిపోతున్నాయి. దేశీయ బాండ్ల మార్కెట్లో కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల బాండ్లను ఫండ్స్‌ తెగనమ్మడం, ప్రభుత్వం ప్రకటించిన చర్యలు రూపాయి రికవరీకి సహకరించకపోవడం వంటి అంశాలు స్థానిక మార్కెట్‌ను దెబ్బతీసినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో ద్వితీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, టాటా కెమికల్స్‌ స్టాక్స్‌ కొనచ్చు

Monday 1st October 2018

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: చోళమండలం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.275 టార్గెట్‌ ధర: రూ.743 ఎందుకంటే: వాధ్వాన్‌ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న ఈ కంపెనీ.. భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల వారికి రుణాలివ్వడంపై దృష్టి సారించే ఏకైక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కూడా ఇదే. 352 నగరాల్లో రూ.1,20,900 కోట్ల నిర్వహణ ఆస్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త గృహాల కొనుగోళ్లు,

Most from this category