STOCKS

News


రుణాల్లో పురుషులను అధిగమిస్తున్న మహిళలు!

Thursday 7th March 2019
news_main1551982809.png-24478

రుణాలు తీసుకునే విషయంలో మహిళలు మరింత మంది ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనమే 2015 నుంచి 2018 మధ్య కాలంలో మహిళా రుణ గ్రహీతల సంఖ్య 48 శాతం పెరగడం. రుణాలు తీసుకునే వారిలో పురుషులే అధికంగా ఉంటున్నప్పటికీ... 2015-18 మధ్య కాలంలో రుణాలు తీసుకునే వారి వృద్ధి 35 శాతానికే పరిమితమైనట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ డేటా ఇన్‌సైట్స్‌ నివేదిక తెలియజేసింది. ఏటా 86 లక్షల నూతన మహిళా ఖాతాలు 2015-18 మధ్య ప్రారంభమయ్యాయి. ఇదే కాలంలో మహిళల నుంచి రుణ దరఖాస్తుల్లో 48 శాతం వృద్ధి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 66 శాతం మంది మహిళా వినయోగదారుల రుణాలు ఉన్నాయి. 

 

‘‘క్రెడిట్‌ డిమాండ్‌ పెరగడం, మహిళలు రుణాలు తీసుకోవడానికి ముందుకు వస్తుండడం వల్ల వీరికి అనుగుణంగా రుణ పరిశ్రమ తమ ఉత్పత్తులను రూపొందించుకునే అవకాశం కలుగుతుంది. అధిక శాతం వ్యాపార రుణ దరఖాస్తులు వస్తున్న రాష్ట్రాల్లో మహిళా ఎంఎస్‌ఎంఈలు ఎక్కువగా ఉండడం ఆహ్వానించతగ్గ పరిణామం. మహిళలే లక్ష్యంగా ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఆర్థిక సమ్మిళిత విధానాలు ఇందుకు తోడ్పడుతున్నాయి. మహిళలలో విద్యాశాతం పెరగుతుండడం, ప్రథమ, ద్వితీయ శ్రేణి మార్కెట్లలో కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ వినియోగం పెరుగుతుండడం, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుండడం వల్ల రాబోయే రోజుల్లోనూ మహిళల నుంచి రుణాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ సీవోవో హర్షాల చందోర్కర్‌ తెలిపారు. సుమారు 38 శాతం మంది మహిళలు సిబిల్‌ స్కోర్‌ను క్రమం తప్పకుండా పరిశీలించుకుంటున్నట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వీపీ సుజాతా ఆహ్లావత్‌ వెల్లడించారు. You may be interested

ట్రంప్‌ హెచ్చరికలు... మార్కెట్‌కు ఆందోళన కలిగించేవేనా?

Thursday 7th March 2019

భారత్‌కు వాణిజ్య ప్రాధాన్యం హోదా (జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ)ను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఆరంభంలో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లినా ఆ తర్వాత లాభాల్లోనే ప్రయాణించాయి. జీఎస్‌పీ కార్యక్రమం 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులకు వర్తిస్తోంది. వీటిపై అమెరికాలో సుంకాలు ఉండవు. ఇప్పటికే ఎగుమతుల వృద్ధి నిదానంగా ఉన్న భారత్‌కు జీఎస్‌పీని రద్దు చేయడం రూపాయిపై

ప్రీమియంతోనే జీ వాటా విక్రయం–సీఎల్‌ఎస్‌ఏ

Thursday 7th March 2019

 జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రస్తుత ప్రమోటర్లు వ్యూహాత్మక వాటాను ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే ప్రీమియంతోనే విక్రయించగలుగుతారని, అయితే యాజమాన్య మార్పు వుండబోదని, పగ్గాలు సుభాష్‌చంద్ర చేతుల్లోనే వుంటాయని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ దిగ్గజం సీఎల్‌ఎస్‌ఏ అంచనావేసింది. ప్రస్తుతం షేరు గత పదేళ్ల ఏవరేజ్‌తో పోలిస్తే 15 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నందున, షేరుపై బై రేటింగ్‌ను ఇస్తూ రూ. 670 టార్గెట్‌ ధరను సీఎల్‌ఎస్‌ఏ నిర్దేశించింది. ప్రమోటింగ్‌ గ్రూప్‌ ఎస్సెల్‌...జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో

Most from this category