STOCKS

News


మహిళా వ్యాపారవేత్తలకు కేంద్రం తోడ్పాటు

Tuesday 15th January 2019
news_main1547536180.png-23600

న్యూఢిల్లీ:  గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌లో వివిధ ఉత్పత్తులను విక్రయించేలా మరింత మంది మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జీ) ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమనియా పేరిట జీఈఎం పోర్టల్‌లో ప్రత్యేకంగా హోమ్‌పేజీ రూపొందించింది. [https://gem.gov.womaniya] ఈ పేజీలో మహిళా వ్యాపారవేత్తలు విక్రయించే ఉత్పత్తులు, సర్వీసుల గురించి వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వివరాలు లభిస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటిదాకా సుమారు 7,31,431 ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి 1,80,862 మంది పైచిలుకు విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్స్‌ జీఈఎంలో నమోదు చేసుకున్నారు.



You may be interested

జనవరి 28న శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల

Tuesday 15th January 2019

తొలి ఫోన్‌ భారత్‌లోనే విడుదల షావోమికి పోటీగా స్మార్ట్‌ఫోన్‌ ధరల శ్రేణి రూ.20,000 న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్‌ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్‌

వ్యాపారంపై తగ్గిన విశ్వాసం!

Tuesday 15th January 2019

జనవరి-మార్చి మధ్య పరిస్థితిపై డీఅండ్‌బీ నివేదిక న్యూఢిల్లీ: వ్యాపార ఆశావాదం జనవరి-మార్చి త్రైమాసికానికి తగ్గింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీ అండ్‌ బీ)కాంపోజిట్‌ బిజినెస్‌ ఆప్టమిజమ్‌ ఇండెక్స్‌ ఈ త్రైమాసికానికి సంబంధించి 73.8గా ఉంది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చిచూస్తే, ఈ సూచీ 7 శాతం తగ్గింది. వచ్చే కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల ఫలితంపై అనిశ్చితి, సంస్కరణల అజెండా కొనసాగడంపై సందేహాలు వ్యాపార ఆశావహ సూచీ తగ్గడానికి కారణమని డీ అండ్‌ బీ

Most from this category