STOCKS

News


సంక్షోభాన్ని ప్రతిబింబించని జెట్‌ షేరు... ఎందుకు?

Monday 15th April 2019
news_main1555321800.png-25141

సాధారణంగా సంక్షోభాల్లో ఉన్న కంపెనీల షేర్లు డీలా పడి ట్రేడవుతుంటాయి. కంపెనీలో ఇబ్బందులన్నీ సదరు షేరు ధరలో ప్రతిబింబిస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఒకపక్క కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, షేరు మాత్రం ఒక మోస్తరు కరెక‌్షన్‌ మాత్రమే చవిచూసింది. అసలు కంపెనీ ఉంటుందా? మూతపడుతుందా? అన్న సంశయాలు నడుస్తున్న వేళ షేరు మాత్రం గత రెండు వారాల్లో దాదాపు 2.3 శాతం లాభపడింది. షేరు ధర కంపెనీ ఇబ్బందులను ప్రతిబింబించకపోవడానికి ఏమిటి కారణమని నిపుణులు శోధిస్తే ఒకటే సరైన కారణంగా కనిపిస్తోంది. రుణదాతలు కంపెనీ ఆర్థిక అవసరాల పట్ల సకాలంలో స్పందించడమే షేరు ధర తీవ్రంగా పతనం కాకుండా అడ్డుకుంటోందని నిపుణుల భావన. దీనికితోడు ఫండింగ్‌ డీల్‌పై మార్కెట్‌ అంచనాలు సైతం షేరు ధరను ఆదుకుంటున్నాయి.

గతంలో కింగ్‌ ఫిషర్‌ ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న తరుణంలో షేరు ధర దారుణంగా పడిపోయి కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ దాదాపు 75 శాతం తుడిచిపెట్టుకుపోయింది. కానీ జెట్‌ ఎయిర్‌వేస్‌ విషయంలో షేరు ధర ఆరు నెలల్లో కేవలం పది శాతం మాత్రమే పతనమైంది. మార్చి చివరి వారంలో రుణదాతల ప్రకటన తర్వాత షేరు లాభాల్లోకి మరలింది. ప్రస్తుతం షేరు వాల్యూషను ఇండిగోతో పోలిస్తే 23 శాతం మాత్రమే డిస్కౌంట్‌లో ఉంది. దీన్ని బట్టి కంపెనీ మౌలిక అంశాలు దెబ్బతిన్నా, మార్కెట్లో మాత్రం ఇంకా ఆశలున్నాయని తెలుస్తోంది. 
ముఖ్యంగా రుణదాతలు కంపెనీకిచ్చిన రుణాలను ఈక్విటీలోకి మారుస్తున్నుట్లు ప్రకటించడం మార్కెట్‌కు నచ్చింది. రూ. 250 చొప్పున లెక్కగట్టి రుణదాతలు కంపెనీ రుణాలు రైటాఫ్‌ చేసిఉంటాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత షేరు ధర సబబేనని భావిస్తున్నాయి. దీనికితోడు రుణదాతలు కంపెనీకి అదనంగా రూ. 1500 కోట్ల సాయం అందించడం కూడా షేరుపై పాజిటివ్‌ ప్రభావం చూపింది. కానీ ఇంతవరకు రుణదాతలు ఏ రేటున షేరును లెక్కగట్టారో బహిర్గతం కాలేదు. కంపెనీ కుప్పకూలకుండా ఉండేదుకే తాత్కాలిక నిధుల సర్దుబాటు చేశారు. చివరకు కంపెనీ పరిస్థితి ఎయిర్‌ఇండియాలాగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ట్రేడర్లు మాత్రం స్వల్పకాలిక ధృక్పధంతో యోచించి షేరుపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే వీరంతా డే ట్రేడర్లని, లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు షేరు నుంచి తప్పుకున్నారని నిపుణుల విశ్లేషణ. రోజూవారీ ట్రేడర్ల ఆటలో భాగంగానే షేరు భారీగా పతనం కాకుండా ఉంటోందని, ఒకమారు వీరు కూడా షేరు కౌంటర్‌ నుంచి బయటకువస్తే అప్పుడు షేరు నిజమైన ధర బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. 


 You may be interested

స్వల్పకాలానికి షార్ట్‌టర్మ్‌ ఐడియాలు

Monday 15th April 2019

వచ్చే రెండుమూడు వారాల్లో మంచి రాబడినందించే పది స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు 1. దిలీప్‌ బుల్డ్‌కాన్‌: కొనొచ్చు టార్గెట్‌ రూ. 725. స్టాప్‌లాస్‌ రూ. 610. కొద్దికాలంగా స్థిరంగా రూ. 620 వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది, వాల్యూంలు అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది. 2. మారుతీ సుజుకీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 7700. స్టాప్‌లాస్‌ రూ. 7150.

మెటల్‌, అటో షేర్ల మెరుపులు

Monday 15th April 2019

మార్కెట్‌ ర్యాలీకి మెటల్‌, అటో షేర్లు అండగా నిలుస్తున్నాయి. ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో మెటల్‌ షేర్లు, టాటామోటర్స్‌ ర్యాలీతో అటో షేర్లు లాభాల బాట పట్టాయి. మెటల్‌ షేర్లు:- అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో దేశీయంగా మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. చైనా ఎగుమతుల 5నెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకోవడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం

Most from this category