STOCKS

News


టోకు ద్రవ్యోల్బణం పెరిగింది..

Wednesday 14th November 2018
news_main1542181933.png-21996

  • అక్టోబర్‌లో 5.28 శాతంగా నమోదు

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. 5.28 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌ నెలలో డబ్ల్యూపీఐ 5.13 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.68 శాతంగా నమోదయ్యింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణం టోకు ద్రవ్యోల్బణం ఎగసిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ 4.53 శాతం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది కేవలం 2.6 శాతంగానే నమోదయ్యింది. ఇక ఈ ఏడాది జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం గరిష్టంగా 5.68 శాతంగా ఉంది. మరోవైపు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో 13 నెలల కనిష్ట స్థాయి 3.31 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. ఇది సెప్టెంబర్‌లో 3.7 శాతంగా నమోదయ్యింది. 



You may be interested

ఏడాది గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Wednesday 14th November 2018

4నెలల్లో 42శాతం ర్యాలీ చేసిన షేరు వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగిస్తూ ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ బుధవారం తాజాగా 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ షేరు రూ.365.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీలో భాగంగా ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో రూ.2.50శాతం లాభపడి రూ.369.90స్థాయిని తాకింది. ఈ ధర షేరు ఏడాది

నవంబర్‌లో నిఫ్టీ 400 పాయింట్ల ర్యాలీకి ఛాన్స్‌!!

Wednesday 14th November 2018

నిఫ్టీ నవంబర్‌లో 400 పాయింట్లు మేర పెరగొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. ఇక్కడి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ ఔట్‌పర్ఫార్మ్‌ కనబరుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎర్నింగ్స్‌ పరంగా ఆశ్చర్యానికి గురిచేసిన కంపెనీలు ఆయా రంగాల ఇండెక్స్‌లను ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  ‘కేవలం క్రూడ్‌ అని మాత్రమే

Most from this category