News


డిప్రెషన్‌ లో మోదీ ప్రభుత్వం: మమతా బెనర్జీ

Saturday 2nd February 2019
news_main1549102308.png-23974

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించడాన్ని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. కేంద్రం చేసిన ప్రకటనలకు ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వం కూడా మధ్యంతర బడ్జెట్‌లో పూర్తిస్థాయి పథకాలను ప్రకటించేందుకు వీల్లేదు. ఎందుకంటే ఈ పథకాలను ఎవరు చేపట్టాలి? లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టే కొత్త ప్రభుత్వం దీన్ని అమలుచేస్తుందా? ఎన్నికల వేళ కేంద్రం తాత్కాలికంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రకటనలకు ఎలాంటి విలువ లేదు. కేవలం ఓట్ల కోసం షో చేయడానికే పలు పథకాలను ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న డిప్రెషన్‌ మోదీ ప్రభుత్వంలో కనిపిస్తోంది’ అని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. గత నాలుగేళ్లుగా రైతులకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా బీజేపీ చేపట్టలేదన్నారు. పెద్దనోట్ల రద్దు, వెనువెంటనే జీఎస్టీ అమలుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక అవ్యవసర పరిస్థితి కొనసాగుతోందని దుయ్యబట్టారు. జాతీయ ఉపాధి హామీ, ఉజ్వల, గ్రామీణ-నైపుణ్యాభివృద్ధి పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచలేదని వ్యాఖ్యానించారు.



You may be interested

వ్యవ‘‘సాయం’’ గట్టెక్కించేనా..?

Saturday 2nd February 2019

-పెను సంక్షోభంలో రైతాంగం -ఆదాయం అంతంత మాత్రమే -సమగ్ర ప్రణాళికతోనే శాశ్వత పరిష్కారం: నిపుణులు అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ

విదేశాంగ శాఖకు రూ.16 వేల కోట్లు!

Saturday 2nd February 2019

మాల్దీవులతోపాటు ఆఫ్రికాకు పెరగనున్న సాయం న్యూఢిల్లీ: 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. ఇందులో ఎంతో వ్యూహాత్మకమైన మాల్దీవులతోపాటు ఆఫ్రికా దేశాలకు అందజేసే సాయం భారీగా పెరిగింది. గత బడ్జెట్‌లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. దీన్లో మాల్దీవులకు అందజేసే సాయం రూ.125

Most from this category