STOCKS

News


పావు శాతమే ఎందుకు తగ్గించాలి?

Saturday 13th April 2019
news_main1555145908.png-25112

వడ్డీరేట్లపై ఆర్‌బీఐ గవర్నర్‌
కేంద్రబ్యాంకులు తమ విధాన నిర్ణయాలను విస్తృతం చేయాలని, పరిధి దాటి ఆలోచించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వడ్డీరేట్ల విషయంలో చాలా సరళంగా ఉండాలన్నారు. ఎప్పుడు చూసినా 25 బీపీఎస్‌ అనే సాంప్రదాయక విధానంలో ఆలోచించడం మానుకోవాలని, పావు శాతానికి అటుఇటుగా రేట్లను తగ్గించే యోచన చేయాలని సూచించారు. అలాగే డోవిష్‌, న్యూట్రల్‌, హాకిష్‌ అంటూ గైడెన్స్‌ ఇవ్వడాన్ని కూడా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. దాస్‌ గవర్నర్‌గా వచ్చాక ఆర్‌బీఐ వరుసగా రెండు సమావేశాల్లో 25 బీపీఎస్‌ చొప్పున మొత్తం 50 బీపీఎస్‌ మేర రేట్లను తగ్గించింది. అలాగే తమ ధృక్పధాన్ని న్యూట్రల్‌కు మార్చుకుంది. రేట్ల శాతం నిర్ధారించేసమయంలో కేంద్రబ్యాంకులకు సరైన అవకాశం కలిగేలా నిర్ణయాలుండాలని దాస్‌ చెప్పారు. ఉదాహరణకు పాలసీ సడలించాలని భావించినప్పుడు 10 బీపీఎస్‌ కోత సరిపోతుందని బ్యాంకు సాం‍ప్రదాయ విధానాల ప్రకారం అనవసరంగా 25 బీపీఎస్‌ కోతను ప్రకటించాల్సి వస్తోందని, దీంతో 15 బీపీఎస్‌ మేర అనవసర సమయంలో రేట్ల తగ్గింపు చేసినట్లవుతోందని వివరించారు.  అదేవిధంగా 25 బీపీఎస్‌ కన్నా కొంచెం ఎక్కువగా సడలించాలనుకుంటే 35 బీపీఎస్‌ తగ్గిస్తే సరిపోయేదానికి సాంప్రదాయాన్ని అనుసరించి 50 బీపీఎస్‌ తగ్గించాల్సివస్తోందన్నారు. దీంతో ఒక్కమారుగా అనుకున్న దానికన్నా రెట్టింపు కోత పెట్టాల్సివస్తోందని చెప్పారు. దీంతో తదుపరి పాలసీ మీటింగ్‌ సమయంలో కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం రాదన్నారు. ఇవన్నీ పరిశీలించి కేంద్రబ్యాంకులు పరిస్థితికి అనుగుణంగా రేట్లను తగ్గించేలా యత్నించాలని సూచించారు. తాజాగా దాస్‌ వ్యాఖ్యలు చూస్తుంటే మరోమారు రేట్‌ కట్‌ ఛాన్సులున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జూన్‌లో ఈ రేట్ల కోత ఉండొచ్చని అంచనా. 



You may be interested

రికార్డు గరిష్ఠాలకు చేరువలో ఎస్‌అండ్‌పీ 500

Saturday 13th April 2019

శుక్రవారం ట్రేడింగ్‌లో అమెరికా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ రికార్డు గరిష్ఠాలకు చేరువైంది. యూఎస్‌లో పెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉండడం సూచీల్లో ఉత్సాహం నింపింది. యూఎస్‌ కంపెనీల ఫలితాలు తాజా ర్యాలీపై నీళ్లు చల్లుతాయన్న అంచనాలకు భిన్నంగా బ్యాంకు ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్లలో జోరు పెరిగింది. దీంతో సెప్టెంబర్‌ రికార్డు క్లోజింగ్‌ స్థాయి దగ్గరకు ఎస్‌అండ్‌పీ 500 చేరింది. సెప్టెంబర్‌ తర్వాత

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 13th April 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌సీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి నష్టంతో ముగిసింది. సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌జీఎక్స్‌)లో రాత్రి 11676.00 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11703.85 పాయింట్లతో పోలిస్తే 27.85 పాయింట్ల నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సూచీలు నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. జనవరి మార్చి త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చనే అంచనాలతో శుక్రవారం సెన్సెక్స్‌ 160

Most from this category