STOCKS

News


ఎగవేతదారులు దేశం నుంచి పారిపోకుండా చూడ్డం ఎలా?

Wednesday 18th July 2018
news_main1531890499.png-18424

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ బడా రుణ ఎగవేతదారులు, ప్రమోటర్లు దేశం వదిలి పారిపోకుండా నిరోధించడం ఎలా అన్న అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత చట్టాల్లో సవరణలు, సూచనలు ఇవ్వడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తారు.  దేశీయ కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల విషయంలో భారత్‌ కాకుండా ఏ ఇతర దేశంలో పౌరసత్వం ఉంది? ఆ కంపెనీ రుణాల పరిస్థితి ఏమిటి? చెల్లింపులు ఎలా ఉన్నాయి? లాభ నష్టాలు పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్ని అంశాలపై ముందే దృష్టి సారించాలని  పలువురు భావిస్తున్నారు. తద్వారా విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సి, నీరవ్‌మోదీ తరహా వ్యక్తుల ఉదంతాల పరిస్థితిని నివారించవచ్చన్నది వీరి అభిప్రాయం. ఇదే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం. ఈ ‍కమిటీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ఇంటిలిజెన్స్‌ బ్యూరో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతినిధులు కూడా ఉంటారు. అలాగే హోమ్‌, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల అధికారులూ సభ్యులుగా ఉంటారు. 
 



You may be interested

టాటా స్పాంజ్‌ ఐరన్‌ లాభం 49 శాతం

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: టాటా స్పాంజ్‌ ఐరన్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 49 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.31 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.46 కోట్లకు పెరిగిందని టాటా స్పాంజ్‌ ఐరన్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.202 కోట్ల నుంచి రూ.273 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ 0.9 శాతం లాభంతో

క్రిసిల్‌ లాభం రూ.77 కోట్లు

Wednesday 18th July 2018

ముంబై: ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.77 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.67 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని క్రిసిల్‌ తెలిపింది. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.436 కోట్లకు, ఇతర ఆదాయం దాదాపు రెట్టింపై రూ.17 కోట్లకు పెరిగాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అషు సుయాశ్‌

Most from this category