STOCKS

News


ఆర్‌బీఐకి అసలు మిగులు నిల్వలు ఏక్కడివి?

Wednesday 21st November 2018
news_main1542823291.png-22273

ఆర్‌బీఐ మిగులు నిల్వలపై ఇటీవల తెగ చర్చ నడుస్తోంది. ఆర్‌బీఐ వద్ద భారీ స్థాయిలో ఉన్న నిల్వల నుంచి కొంత మొత్తాన్ని బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంటే, దీన్ని పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ బోర్డు సైతం నిర్ణయించింది. దీంతో అందరికీ ఆర్‌బీఐ బ్యాలన్స్‌ షీట్‌పై ఆసక్తి నెలకొంది. 

 

బ్యాలన్స్‌ షీటు
2017-18 సంవత్సరం ఆర్‌బీఐ బ్యాలన్స్‌ షీటు రూ.36.2 లక్షల కోట్లు. బ్యాలన్స్‌ షీటు అంటే ఓ కంపెనీ మాదిరి అనుకోవద్దు. ఆర్‌బీఐ ముద్రించే కరెన్సీ నోట్లు దాదాపు సగం ఉంటాయి. మరో 26 శాతం రిజర్వులు. వీటిని ప్రధానంగా విదేశీ సెక్యూరిటీలు, భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో, బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఆర్‌బీఐ వద్ద 566 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీనితో కలిపి చూస్తే విదేశీ ఆస్తులు మొత్తం మీద 77 శాతంగా ఉంటాయి. 

 

నిల్వలు 
ఆర్‌బీఐ వద్దనున్న రిజర్వ్‌లు అన్నీ ఒకటే కావు. ప్రస్తుతం నడుస్తున్న చర్చకు సంబంధించి రెండున్నాయి. కరెన్సీ, బంగారం రీవ్యాల్యూయేషన్‌ అకౌంట్‌ (సీజీఆర్‌ఏ) కలిపి రూ.6.9 లక్షల కోట్లు (2017-18)గా ఉన్నాయి. అంటే భారత్‌ తరఫున కలిగి ఉన్న విదేశీ కరెన్సీ, బంగారం విలువ. కనుక ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ మారుతూ ఉంటుంది. విలువల్లో మార్పుల ఆధారంగా ఆర్‌బీఐ లాభం, నష్టపోవడం జరుగుతుంటుంది. గతేడాది సీజీఆర్‌ఏ 30.5 శాతం పెరిగింది. బంగారం ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం ఇందుకు కారణం. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ, ఎక్సేంజ్‌ రేటు కార్యకలాపాల ద్వారా ఊహించని బాధ్యతలు ఎదురైతే నెరవేర్చేందుకు కంటింజెన్సీ ఫండ్‌ అని ఉంటుంది. మార్కెట్‌ లిక్విడిటీ, కరెన్సీ అస్థిరతల్లో ఆర్‌బీఐ దీని ద్వారా జోక్యం చేసుకుని నివారించే ప్రయత్నం చేస్తుంటుంది. 2017-18 సంవత్సరంలో కంటింజెన్సీ ఫండ్‌ (సీఎఫ్‌) రూ.2.32 లక్షల కోట్లుగా ఉంది. సీజీఆర్‌ఏ, సీఎఫ్‌ కలిపి మొత్తం ఆస్తుల్లో 26 శాతంగా ఉన్నాయి. 

 

మిగులు నిల్వలు
కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ బదలాయించాల్సినవి. ఆర్‌బీఐ ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. తన అవసరాలు పోను మిగులు నిల్వలను కేంద్రానికి బదలాయించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐకి ఆదాయం ఎలా వస్తుందన్న సందేహం ఉండొచ్చు. తన దగ్గరుండే సెక్యూరిటీల ద్వారా వడ్డీ ఆదాయం ఆర్‌బీఐకి వస్తుంది. 2017-18లో కంటింజెన్సీ ఫండ్‌కు చేసిన కేటాయింపు రూ.14,200 కోట్లుగా ఉంది. కొత్త కరెన్సీ నోట్ల ముద్రణకు అధిక ఖర్చు కావడమే ఇందుకు కారణం. సీఎఫ్‌కు ఎక్కువ కేటాయింపు చేస్తే మిగులు నిల్వలు తగ్గుతాయి. You may be interested

యస్‌ బ్యాంకు ప్రమోటర్ల మధ్య సంధి కుదిరేనా!

Wednesday 21st November 2018

యస్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాణా కపూర్‌, సహ ప్రమోటర్‌ మధు కపుర్‌తో సంధి కోసం చర్చలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు జవనరి 31తో ఎండీ, సీఈవో పదవుల నుంచి రాణా కపూర్‌ వైదొలగాల్సి ఉంది. దీంతో ఆయన చర్చలకు తెరతీయడం ఆసక్తికరం. ‘‘మధు కపుర్‌, ఆమె కుటుంబంతో పరస్పర పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లతో రెండు ప్రమోటర్ల గ్రూపుల మధ్య

వచ్చే ఏడాదిలో మార్కెట్‌ ర్యాలీ..!

Wednesday 21st November 2018

2019 చివరినాటికి నిఫ్టీ 11,800 పాయింట్ల వద్దకు చేరుతుందని అంచనావేసిన ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ ముంబై: సాధారణ ఎన్నికలు ఆర్థిక వ్యవస్థకు అంతరాయమే తప్పించి వ్యాపార సరళిని, వ్యవస్థను ఆటంకపరిచే అంశం ఏమాత్రం కాదని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఆదిత్య నారాయణ్ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ పట్ల పాజిటివ్‌గా ఉన్నట్లు ప్రకటించింది. వచ్చేఏడాది ద్వితియార్థంలో మార్కెట్‌ ర్యాలీ ఉంటుందని అంచనావేసిన ఈ సంస్థ.. 2019 చివరినాటికి నిఫ్టీ 11,800

Most from this category