STOCKS

News


ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలి

Monday 28th January 2019
news_main1548648098.png-23835

  • ఆరోగ్యానికి మరింత చేయూతనివ్వాలి
  • ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల డిమాండ్‌

న్యూఢిల్లీ: రానున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగం పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినప్పటికీ కొన్ని విధానపరమైన చర్యల అవసరాన్ని ప్రస్తావించాయి. ఎగుమతులకు ప్రస్తుతం ప్రోత్సాహాలు కల్పిస్తున్న ‘భారత్‌ నుంచి సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్‌)’ 2020 మార్చిలో కాల వ్యవధి తీరిపోతుందని, దీన్ని పొడిగించాలని పరిశ్రమ ప్రధానంగా కోరుతోంది. ఈ తరహా పథకాలను పొడిగించాలని పరిశ్రమ కోరుకుంటున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. ఇక పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) వ్యయాలపై ఉన్న 150 ప్రామాణిక మినహాయింపును 200 శాతం చేయాలన్నది మరో డిమాండ్‌గా ఆయన పేర్కొ‍న్నారు. ఆర్‌అండ్‌డీకి ఈ మాత్రం ప్రోత్సాహకం అవసరమన్నారు.
జీఎస్టీని మినహాయించాలి...
జీఎస్టీని హేతుబద్ధీకరించాలని హెల్త్‌కేర్‌ రంగం కోరుతోంది. పెరిగిన ముడి పదార్థాల ధరలతో ఆరోగ్య సంరక్షణ భారంగా మారుతోందని అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఎండీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను అందుబాటు ధరల్లో ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా... ఈ రంగానికి సరఫరా అయ్యే ముడి పదార్థాలపై జీఎస్టీని మినహాయించాలని సూచించారు. ఎందుకంటే ఈ ధరల భారాన్ని రోగుల నుంచి రికవరీ చేసుకోవడానికి అనుమతించకపోవడంతో, చెల్లించిన జీఎస్టీని సర్దుబాటు చేసుకోలేకపోతున్నట్టు ఆమె చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై ప్రభావం పడి, తమ నిధుల లభ్యత ప్రభావితమై అధునాతన టెక్నాలజీలు, నాణ్యతపై వెచ్చించే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 150 శాతం తరుగుదలను అనుమతించే సెక్షన్‌ 35ఏడీని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా ఆమె డిమాండ్‌ చేశారు. నూతన ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఇది ప్రోత్సాహకాలు కల్పిస్తుందని ఆమె వివరించారు. ‘‘ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. మన దేశంలో ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేసే సగటు ఖర్చు 85 డాలర్లు (6,035). ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రానున్న బడ్జెట్‌లో ఆయుష్‌మాన్‌ భారత్‌ పథకాన్ని నియంత్రణలు లేకుండా ప్రైవేటు రంగానికీ విస్తరింపచేయాలి’’ అని హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌, సీఈవో అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
ప్రోత్సాహకాలు కావాలి...
చిన్న పట్టణాల్లోనూ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను రానున్న బడ్జెట్‌లో ప్రకటించాలని హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ ‘లెట్స్‌ఎండీ’ కోరింది. అలాగే, బీమా వ్యాప్తికి కోసం చర్యలు అవసరమని ఈ సం‍స్థ సీఈవో నివేష్‌ ఖండేల్‌వాల్‌ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవల వ్యయాలు పెరిగిపోతుంటే, ఈ రంగంలో బీమా విస్తరణ అతి తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.



You may be interested

జూన్‌ నాటికి ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ డీమెర్జర్‌

Monday 28th January 2019

కోల్‌కతా: ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ను మూడు కంపెనీలుగా విడగొట్టి  లిస్టింగ్‌ చేసే కార్యక్రమం వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు కంపెనీ ఎండీ ఆర్‌వెంకటరామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూపు చేపట్టిన ఎన్‌సీడీ ఇష్యూ కింద ఇప్పటికే రూ.1,000 కోట్లకు సబ్‌స్క్రిప్షన్‌ లభించినట్టు చెప్పారు. ఈ రిటైల్‌ ఇష్యూ నుంచి రూ.2,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐఐఎఫ్‌ఎల్‌

పన్ను బకాయిలేమీ లేవు

Monday 28th January 2019

- ఐటీ నుంచి మైండ్‌ట్రీ షేర్లు విడిపించుకుంటాం - కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ చెబుతున్నట్లుగా తమ కంపెనీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టం చేసింది. బాకీలు రాబట్టుకోవడం కోసమంటూ ఆదాయపన్ను శాఖ అటాచ్‌ చేసుకున్న మైండ్‌ట్రీ షేర్లను విడిపించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. "ఆదాయ పన్ను శాఖ 148, 153ఎ సెక్షన్ల కింద ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా ప్రమోటరు, కంపెనీ

Most from this category